అంగవైకల్యం గల పాత్రలో నటించి మెప్పించిన టాలీవుడ్ హీరోస్

న‌టులు అన్నాక ఏ క్యారెక్ట‌ర్ ఇచ్చినా చేయాలి.పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి క్యారెక్ట‌ర్ లో జీవించాలి.

అంతేకాదు.క‌థ‌తో పాటు క‌థ‌లో క్యారెక్ట‌ర్ ను కూడా పండించాలి.అలాగే కొంద‌రు న‌టులు దివ్యాంగులుగా చాలెంజింగ్ రోల్ చేశారు.

త‌మ న‌ట‌న‌తో అందరి చేత వారెవ్వా అనిపించుకున్నారు.బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యాలు సాధించారు.

ఇంత‌కీ టాలీవుడ్ లో దివ్యాంగుల పాత్ర‌లు చేసి ఆక‌ట్టుకున్న హీరోలు ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం.

నాగార్జున‌

Tollywood Heroes Acted As Disabled Person, Tollywood Heroes, Disabled Persons, R
Advertisement
Tollywood Heroes Acted As Disabled Person, Tollywood Heroes, Disabled Persons, R

యువ‌సామ్రాట్ నాగార్జున తాజాగా ఓ దివ్యాంగుడి పాత్ర చేసి అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు.ఊపిరి సినిమాలో కాళ్లు, చేతులు ప‌నిచేయ‌ని క్యారెక్ట్ చేశాడు.సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు వీల్ చైర్ లోనే ఉండి న‌టించాడు.

వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమాలో నాగార్జున న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

రామ్ చ‌ర‌ణ్

Tollywood Heroes Acted As Disabled Person, Tollywood Heroes, Disabled Persons, R

మెగాస్టార్ చిరంజీవి న‌ట‌వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన రామ్ చ‌ర‌ణ్ ఎన్నో విజ‌యాలు సాధించాడు.తాజాగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రంగంస్థ‌లం సినిమాలో రామ్ చ‌ర‌ణ్ చెవిటి వాడి క్యారెక్ట‌ర్ చేశాడు.ప‌ల్లెటూరి వ్య‌క్తిగా ఈ పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ జీవించాడు.

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యాన్ని అందుకుంది ఈ సినిమా.

ర‌వితేజ‌

Tollywood Heroes Acted As Disabled Person, Tollywood Heroes, Disabled Persons, R
శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

మాస్ మ‌హారాజ ర‌వితేజ కూడా తాజాగా ఓ దివ్యాంగుడి క్యారెక్ట‌ర్ చేశాడు.రాజా ది గ్రేట్ సినిమాలో అంధుడి క్యారెక్ట్ చేశాడు.అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమాలో ర‌వితేజ ప‌వ‌ర్ ఫుల్ క్యారెక్ట‌ర్ చేశాడు.

Advertisement

ఈ సినిమా మంచి విజ‌యాన్ని అందుకుంది.

రాజ్ త‌రుణ్

యంగ్ హీరో రాజ్ త‌రుణ్ కూడా దివ్యాంగుడి పాత్ర చేశాడు.అంద‌గాడు సినిమాలో అంధుడి క్యారెక్ట‌ర్ చేసి అంద‌రిని ఆక‌ట్టుకున్నాడు.ఉయ్యాల జంపాలతో ఇండస్ట్రీలోకి వ‌చ్చిన రాజ్ తరుణ్ తేజ్ మొదటి సినిమా స‌క్సెస్ తో వెన‌క్కి తిరిగి చూసుకోలేదు.

ఆది పినిశెట్టి

విల‌క్ష‌ణ న‌టుడు ఆది పినిశెట్టి కూడా అంధుడి పాత్ర చేశాడు.నేనెవ‌రో సినిమాలో రెండు క్యారెక్ట‌ర్లు చేసిన ఆయ‌న.ఒక‌ పాత్రలో బ్లైండ్ చెఫ్ గా, మరొక పాత్రలో క్రైమ్ రిపోర్టర్ గా న‌టించాడు.

ఈ సినిమా సైతం మంచి విజ‌యం సాధించింది.

తాజా వార్తలు