ఎందుకు ఫ్లాప్ అయ్యాయో తెలియని 5 హిట్ సినిమాలు..టీవీ లో వస్తే ఎప్పుడు చూస్తూనే ఉంటాం

ఎందుకు ఫ్లాప్ అయ్యాయో తెలియని 5 హిట్ సినిమాలు

 Tollywood Flop Movies Which Are Hit In Tv, Naa Autograph, Orange Movie, Khaleja,-TeluguStop.com

కొన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య థియేటర్స్ లో రిలీజవుతాయి.కానీ ఊహించని విధంగా ఫ్లాప్ అవుతుంటాయి.

కథని అర్ధం చేసుకునే పరిణితి ప్రేక్షకులకు లేకపోవడం వల్ల కొన్ని సినిమాలు ఫెయిల్ అయితే, ఆ సినిమాలకు పోటీగా వేరే సినిమాలు ఉండడం వల్ల కొన్ని సినిమాలు ఆడవు.థియేటర్స్ లో ఆడకపోయినా, బుల్లితెర మీద మాత్రం హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి.

ఇప్పటికీ ఎన్నిసార్లు వేసినా చూస్తూనే ఉంటారు.ఇంత మంచి మెసేజ్ ఉన్న సినిమాని థియేటర్ లో ఎందుకు చూడలేదు అని అనుకుంటారు.

అలాంటి వాటిలో రాజశేఖర్ నటించిన ఓంకారమ్ సినిమా ఒకటి.రాజశేఖర్, ప్రేమ హీరో హీరోయిన్ గా 1997 లో ఉపేంద్ర డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కథ బాగున్నప్పటికీ ఆడియన్స్ కి అర్ధం చేసుకునే మెచ్యూరిటీ లేకపోవడం వల్ల ఫ్లాప్ అయ్యింది.

ఒక ఇన్నోసెంట్ పర్సన్ ని ఒక అమ్మాయి లవ్ చేసి మోసం చేస్తే, ఆ వ్యక్తి రెబల్ అండ్ రెక్లెస్ గా మారి, ఒక పిచ్చోడిలా ఆ అమ్మాయి వెంట పడతాడు.ఈ సినిమాలో రాజశేఖర్ యాటిట్యూడ్, ఆ పిచ్చితనం అర్జున్ రెడ్డి, RX 100 సినిమాల్లో కనబడతాయి.

ఈ రెండు సినిమాలని మిక్స్ చేస్తే ఈ ఓంకారమ్ సినిమా.  డైరెక్టర్ ఉపేంద్ర 20 ఏళ్ళకు ముందే ఇలాంటి కథని ఆలోచించారంటే ఆయన సత్తా ఏంటో తెలుస్తుంది.

కానీ జనానికి ఆ సినిమా విలువ లేటుగా అర్ధమయ్యింది.ఆ సినిమా టి‌విల్లో వచ్చినప్పుడు ఛా, ఈ సినిమా ఎందుకు మిస్ అయ్యామా అని ఫీలవుతారు.

Telugu Khaleja, Naa Autograph, Omkaram, Orange, Vedham-Movie

ఇక రామ్ చరణ్, జెనీలియా నటించిన ఆరెంజ్ సినిమాని జనం అర్ధం చేసుకోలేకపోయారు.నిజానికి ఈ కథలో డైరెక్టర్ చెప్పిన పాయింట్ బాగుంటుంది.కానీ జనం దాన్ని సరిగా రిసీవ్ చేసుకోలేకపోయారు.అయితే టి‌విలో వచ్చినప్పుడు మాత్రం అందరూ మిస్ అవ్వకుండా చూస్తారు.ఈ సినిమా ఎలా ఆడినా గాని, ఇప్పటికీ కొంతమంది యువకులు ఈ సినిమా పాటలను వింటూ ఉంటారు.ఏ ఆటో ఎక్కినా రోజులో ఒక్కసారైనా ఈ పాట వేయనిదే అతనికి పూట గడవదంటే అర్ధం చేసుకోండి.

Telugu Khaleja, Naa Autograph, Omkaram, Orange, Vedham-Movie

రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ సినిమా చాలా బాగుంటుంది.ప్రేమలో ఓడిపోయామని ఆగిపోకూడదు, జీవితంలో సర్వం కోల్పోయినా భవిష్యత్తు మిగిలే ఉంటుంది అని స్ట్రాంగ్ మెసేజ్ నిచ్చినటువంటి మూవీ.కానీ ఈ సినిమా ఎందుకో థియేటర్స్ లో ఆడలేదు.కానీ టి‌విలో వస్తే మాత్రం ఖచ్చితంగా చూస్తారు.లవ్ ఫెయిల్యూర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చూస్తారు.ఎందుకు మిస్ అయ్యామా అని ఫీలవుతారు.

Telugu Khaleja, Naa Autograph, Omkaram, Orange, Vedham-Movie

త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేశ్ కాంబినేషన్ లో వచ్చిన ఖలేజా చాలా స్టైలిష్ గా ఉంటుంది.ఒక మనిషి తన కోసం కాకుండా, పక్కనోడి కోసం మంచి జరగాలి అని కోరుకుంటే దేవుడే సహాయం చేస్తాడని, సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కాపాడితే వారే దేవుడు అని చక్కని సందేశాన్ని ఇచ్చారు.కానీ ఎందుకో ఈ సినిమా ఆడలేదు.కానీ టి‌విలో మాత్రం సూపర్ హిట్ అయ్యింది.ఇప్పటికీ ఎన్నిసార్లు చూసినా ఈ సినిమా బోర్ కొట్టదు.

Telugu Khaleja, Naa Autograph, Omkaram, Orange, Vedham-Movie

క్రిష్ డైరెక్షన్ లో అల్లు అర్జున్, మంచు మనోజ్ కాంబినేషన్ లో వచ్చిన వేదం సినిమా ఎంత మంచి సినిమానో.ఒక కేబుల్ రాజు, ఒక రిచ్ పర్సన్, సరోజ అనే ఒక వేశ్య, ఒక ముస్లిం కుటుంబం, ఒక ముసలాయన, అతని కోడలు, ఆవిడకో కొడుకు…డబ్బు, మతం వీళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది అనే అంశం ద్వారా మనిషి జీవన విధానం ఎలా ఉండాలో తెలియజేసిన మూవీ ఈ వేదం.కానీ జనాలు ఈ సినిమాని పెద్దగా ఆదరించలేదు.కానీ బుల్లితెర మీద మాత్రం ఇప్పటికీ ఆడుతుంది.కొమరం పులి, వన్ నేనొక్కడినే, అర్జున్ ఇలా థియేటర్ లో పెద్దగా ఆడక, బుల్లితెర మీద ఆడిన, ఆడుతున్న సినిమాలు చాలానే ఉన్నాయి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube