నేడే ' జీరో షాడో డే '.. మీరు కూడా ఈ సమయాల్లో ఓసారి ట్రై చేయండి..

నేడు బెంగుళూరు నగరంలో ‘జీరో షాడో డే( zero shadow day )’ ను జరుపుకోబోతున్నారు.బుధవారం నాడు సూర్యుడు మన నడినెత్తి పైకి రాబోతున్నాడు.

 Today Is 'zero Shadow Day'.. You Should Also Try This Time, Zero Shadow, Zero S-TeluguStop.com

దీంతో మన నీడ మనకే కనిపించదు.ఈ నీడ భారతదేశంలోని హైదరాబాద్, బెంగళూరు, కన్యాకుమారి, భోపాల్, ముంబై లాంటి నగరాలలో వివిధ రోజుల్లో ఈ జీరో షాడో కనిపించబోతోంది.

ఇక అసలు జీరో షాడో డే అంటే.సూర్యుడు( SUN ) సరిగ్గా మన నన్నెత్తి పై ఉన్నప్పుడు జీరో షాడో డే ఏర్పడుతుంది.దీని ఫలితంగా మనం మన నీడని చూడలేము.ఇలా అసలు ఎందుకు జరుగుతుంది అంటే. భూమధ్యరేఖ( Equator)కు సమీపంలో ఉన్న ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంటుంది.ఈ సమయంలో సూర్యుడు కోణం భూమితో దాదాపు లంబంగా ఉండడంతో నీడ అనేది కనిపించదు.

సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్న సమయంలో అనేకసార్లు దాని స్థానం మారుతుండగా ఏడాదిలో రెండు వేరువేరు సమయాల్లో సూర్యుడు భూమికి సరిగ్గా నిటారుగా, లంబంగా రావడం జరుగుతుంది.దీంతో ఈ జీరో షాడో డే వస్తుంది.

ఇక భారతదేశ ప్రముఖ నగరాలలో ఏఏ రోజుల్లో ఈ జీరో షాడో డే జరుపుకుంటారో ఓసారి చూద్దాం.

బెంగళూరు నగరంలో ఏప్రిల్ 24 , ఆగస్టు 18 (స్థానిక మధ్యాహ్నం: 12:17, 12:25) లకు, హైదరాబాద్ లో 09 మే, 05 ఆగస్టు (స్థానిక మధ్యాహ్నం: 12:12, 12:19) లకు, ముంబై నగరంలో 15 మే, 27 జూన్ (స్థానిక మధ్యాహ్నం: 12:34, 12:45), భోపాల్ నగరంలో 13 జూన్, 28 జూన్ (స్థానిక మధ్యాహ్నం: 12:20, 12:23) లకు ఈ జీరో షాడో డే ను అనుభవించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube