అసెంబ్లి ఎన్నికల సందర్భంగా జిల్లాలో పటిష్టi బందోబస్తు

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు వచ్చేసిన కేంద్ర సాయుధ పోలీసు బలగాలు క్రిటికల్ పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( Akhil Mahajan )రాజన్న సిరిసిల్ల జిల్లా :త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల( Assembly elections ) నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాజన్న సిరిసిల్ల పోలీసు సిబ్బందికి సహాయంగా బి ఎస్ ఎఫ్ రెండు కంపెనీల 200 మంది కేంద్ర సాయుధ పోలీసు బలగాలు రావడం జరిగింది.

సోమవారం రోజున జిల్లా కేంద్రంలో 100 మంది జిల్లా పోలీస్ సిబ్బందితో కలిసి, 200 మంది కేంద్ర బలగాలతో కలసి ఫ్లాగ్ మార్చ్ వంటి కవాతును జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జెండా ఊపి ప్రారంభించి వారితో పాటుగా సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ నుండి గాంధీ,అంబేద్కర్, గోపాల్ నగర్ చౌరస్తాల మీదుగా బీ.

వై నగర్, సంజీవయ్య నగర్,వెంకంపెట్ మీదుగా కొత్త బస్టాండ్ వరకు కొనసాగిన కవాతులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ,.

అసెంబ్లీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, రాబోయే ఎన్నికలకు సంబంధించి జిల్లాకు 200 మంది బృందంతో కూడిన కేంద్ర బలగాలు వచ్చాయని త్వరలో మరిన్ని బలగాల వస్తాయని అన్నారు.శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇప్పటి నుండే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి సాధించడం జరిగిందని అన్నారు.

జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లాలో మొత్తం 560 పోలింగ్ స్టేషన్స్ ఉండగా,ఇందులో 118 క్రిటికల్ స్టేషన్స్ గుర్తించడం జరిగింది అన్నారు.ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన, గొడవలు సృష్టించాలని చూసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని,ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగిలే ప్రజలు ప్రతి ఒక్కరు సహకరించాలి.

Advertisement

పాత నేరస్తులను ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా బైండోవర్ చేస్తున్నామని అన్నారు.,జిల్లా పరిధిలోని అవసరమైన ప్రదేశాల్లో 05 చెక్ పోస్టులతో పాటుగా డైనమిక్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

అక్రమ నగదు తరలింపు వంటి నేరాలను అడ్డుకునేందుకు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నమని, సరైన పత్రాలు లేకుండా నగదు తదితర వస్తువులు తీసుకెళితే సీజ్ చేస్తున్నట్లు తెలిపారు.ఈ ఫ్లాగ్ మార్చ్ లో బి ఎస్ ఎఫ్ కమాండెంట్, అడిషనల్ కమాండెంట్, సిరిసిల్ల డిఎస్పీ ఉదయ్ రెడ్డి,సి.

ఐ ఉపేందర్, ఆర్.ఐ యాదగిరి, ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది, బి ఎస్ ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News