Raja Rajeswara Swamy : రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటున్న వేలాది మంది భక్తులు

రాజన్న సిరిసిల్ల జిల్లా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ( Vemulawada ) క్షేత్రంలో మహా శివరాత్రి జాతర వైభవోపేతంగా జరుగుతున్నది.

మహా శివరాత్రి( Maha Shivaratri ) పర్వదినం సందర్భంగా ఇతర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు వేములవాడ ఆలయానికి వచ్చి క్యూలైన్ల ద్వారా ఆ పరమేశ్వరుని దర్శించుకుంటున్నారు.

రాజరాజేశ్వర స్వామి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి చూస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది.క్యూలైన్లలో వేచి చూస్తున్న భక్తులకు( Devotees ) నేరుగా త్రాగునీరు, పండ్లు, పాలను దేవస్థానం తరపున పంపిణీ చేయడం జరుగుతున్నది.

రాజరాజేశ్వర స్వామి( Rajarajeshwara Swamy ) దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది.భక్తుల కోసం అవసరమైన మేర రాజరాజేశ్వర జల ప్రసాద కేంద్రాల ద్వారా త్రాగునీటి ఏర్పాట్లు, ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు పారిశుధ్య సిబ్బంది శుభ్రం చేస్తున్నారు, చిన్నపిల్లలకు తల్లులు పాలు అందించేందుకు ప్రత్యేకమైన కేంద్రాలను సైతం దేవస్థానం ఏర్పాటు చేసింది.

Advertisement

Latest Rajanna Sircilla News