ఎన్నో సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన మన భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయి.ఇలాంటి ఆలయాలలో వినాయకుడి ఆలయాలు కూడా చాలా ఉన్నాయి.
మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు ముందుగా వినాయకుడిని పూజించి కార్యం చేయడం ఆనవాయితీ.అయితే పూర్వం ఈ ఆలయంలో 108 శివలింగాలు కలిసి వినాయకుడి రూపంలోకి మారి భక్తులకు దర్శనం ఇస్తోంది.
ఈ విధంగా శివలింగాలు వినాయకుడు రూపంలో మారడానికి కారణం ఏమిటి? ఈ ఆలయం ఎక్కడుంది అనే విషయాలను తెలుసుకుందాం…
తమిళనాడు రాష్ట్రం, చెన్నై నగరంలో పొన్నేరి అనే ప్రాంతానికి కొంత దూరంలో అంకోల గణపతి ఆలయం ఉంది.ఈ ప్రాంతాన్ని చిన్నకావనముగా పిలుస్తారు.
ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలోని గర్భ గుడిలో చతుర్వేదేశ్వర స్వామి, శ్రీ నూటే శ్వరస్వామి విడివిడిగా భక్తులకు దర్శనం ఇస్తారు.అదేవిధంగా గర్భాలయం వెలుపల రెండు శివలింగాలు రెండు నందులు ప్రత్యేకంగా భక్తులకు దర్శనం కల్పిస్తాయి.
మన దేశంలో ఏ ఆలయంలో లేని విధంగా ఈ ఆలయంలో అంకోల వృక్షము ఒక ప్రత్యేకత అని చెప్పవచ్చు.
ఈ ఆలయ విశిష్టత విషయానికి వస్తే పూర్వం పరమేశ్వరుడి ఆజ్ఞ మేరకు ఈ ప్రాంతానికి వచ్చిన అగస్త్య మహర్షికి ఒకరోజు కాశి క్షేత్రం దర్శించాలనే కోరిక కలిగింది.ఈ క్రమంలోనే కాశీకి వెళ్లాలని భావించిన అగస్త్యునికి శివుడు కలలో కనిపించి ఇక్కడి నది తీరాన చతుర్వేదపురంలో నేను చతుర్వేదేశ్వరునిగా కొలువై ఉన్నాను.అక్కడ ఉన్న అంకోల వృక్షము కింద 108 రోజులు రోజుకొక సైకత లింగాన్ని చేసి పూజించడం వల్ల నీకు కాశీ వెళ్లిన పుణ్యఫలం లభిస్తుందని చెబుతాడు.
పరమేశ్వరుడు చెప్పిన విధంగానే అగస్త్యుడు 108 రోజులు అంకోల వృక్షము కింద సైకత లింగాన్ని చేసి పూజిస్తాడు.అయితే 108వ రోజు శివ లింగాలు అన్నీ కలిపి వినాయకుడి రూపంలో దర్శనమిచ్చాయి.
ఆ సమయంలో పరమేశ్వరుడు అగస్త్యునికి కనిపించి అగస్త్య నీవు శివలింగాలను చేసి పూజించే ముందు వినాయకుడికి పూజ చేయటం మర్చిపోయావు.అందుకే వినాయకుడికి కోపం వచ్చి ఇలా జరిగింది.నీ తప్పు వల్ల భవిష్యత్తు తరాల వారికి ఎంతో ప్రయోజనం.ఈ అంకోల వృక్షము కింద శివలింగ రూపంలో దర్శనమిస్తున్నటు వంటి ఈ వినాయకుడిని పూజించి భక్తులు కోరికలు కోరడంతో భక్తుల కోరికలు తప్పకుండా నెరవేరుతాయని శివుడు చెప్పడంతో ఎంతో సంతోషించిన అగస్త్యుడు ఆ శివలింగం పక్కనే ఒక శివలింగాన్ని ప్రతిష్టించి పూజ చేశాడు.
అప్పటి నుంచి ఈ ఆలయంలో స్వామి వారు లింగ రూపంలో మనకు దర్శనం ఇస్తున్నారు.
LATEST NEWS - TELUGU