ఆ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను.. రౌడీ హీరో పై ప్రశంసలు కురిపించిన హీరోయిన్?

విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్థాయిలో నటిస్తున్న మొట్టమొదటి చిత్రం లైగర్. ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో ఆగస్టు 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

 Heroine Ananya Panday Interesting Comments On Vijay Devarakonda Details, Vijay D-TeluguStop.com

ఇప్పటికే షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

ఇక ఈ సినిమా ద్వారా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది.

ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి కావడంతో అనన్య పాండే ఒక జాతీయ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సినిమాలో నటించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్ సమయంలో హీరో విజయ్ దేవరకొండ తో పాటు దర్శక నిర్మాతలతో కలిసి ఎంతో సరదాగా గడపామని, ఇలా వీరితో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని అనన్య పాండే వెల్లడించారు.లైగర్ సినిమా షూటింగ్ రోజులను తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని, ఆ క్షణాలు ఎప్పటికీ గుర్తుండి పోతాయని చెప్పుకొచ్చారు.

Telugu Ananyapanday, Ananya Panday, Liger, Telugu, Tollywood-Movie

ఇకపోతే హీరో విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ ఈమె తన పై ప్రశంసలు కురిపించారు.విజయ్ దేవరకొండ షూటింగ్ లొకేషన్లో అందరితో ఎంతో సరదాగా గడుపుతారని, ఈయన ఎంతో మంచి వ్యక్తిత్వం కలవారని, విజయ్ దేవరకొండకు ఎంతో దయా గుణం ఉందని ఈ సందర్భంగా అనన్య పాండే హీరో గురించి పొగడ్తల వర్షం కురిపించారు.ఈ సందర్భంగా అనన్య పాండే విజయ్ దేవరకొండ గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube