పండగలు వస్తే ప్రజల కంటే ఎక్కువ సైబర్ నేరగాళ్లకే ఆనందం.లింకులు పంపడం డబ్బు లూటీ చేయడం.
లేదా స్మాట్ గా ఆపర్లు అంటూ డబ్బు చెల్లించమనడం.నిజంగానే పండగ ఆఫర్లేమో అని ప్రజలు గుడ్డిగా నమ్మి కొనేయడం, నమ్మేయడం శరమామూలే.
అక్కడే వచ్చి పడుతుంది చిక్కంత.జాలరి ఎర వేసినట్టు వీళ్ల ఆఫర్లకు ప్రజలు చిక్కాల్సిందే అన్నట్టుగా జరుగుతుంది సోషల్ మీడియా పుణ్యమా అని.ఒక్క లింక్ క్లిక్ చేస్తే చాలు.వాళ్లు పెట్టే కండీషన్లలో మరొకటి ఈ లింక్ ను మీ గ్రూప్ లో షేర్ చేస్తే మీకు ఆఫర్ దక్కుతుంది అని చెప్పడం.
అది కాస్త నమ్మి మనకు తెలిసినవాళ్లను మనమే మోసం చేస్తున్నాం మోసం అని తెలియకుండానే.మనం మోసపోవడమే కాకుండా మరికొంత మందిని ఆ ఊబిలోకి లాగుతున్నాం.ఈ లొల్లంత ఇప్పుడు మాకెందుకు తల్లి అనుకుంటున్నారా?.న్యూఇయర్ వస్తుంది కదా.అందమైన ప్రపంచాన్ని పరిచయం చేస్తాం ఆనందంలో మునిగి తేలండి అంటూ మళ్లీ మొదలుపెట్టారు ఆ కేటుగాళ్లు.అందుకే మా ప్రేక్షకులైనా మోసపోవద్దు అని ఈ వీడియో మీకోసం…
ఒచ్చేసామండి ఒచ్చేసాం మమ్మల్ని న్యూఇయర్ మీ వద్దకు చేరుస్తుంది.మీకు తెలియకుండానే మీ పీకకోసేస్తాం అన్నట్టుగా వేట మొదలెట్టారు కేటుగాళ్లు.అందమైన అమ్మాయి, తక్కువ ధరకే మందు, అవసరమైతే ఫుల్ గా వేయచ్చు చిందు అని ఆశల పల్లికిలో విహరించేలా చేస్తున్న వారికి మన కలలు తోడవుతున్నాయి.
దీంతో మందు చిందు అమ్మాయి పక్కన పెడితే మాడిపోయిన చపాతీల అవుతోంది పరిస్థితి.వాళ్ల కొత్తు ఎత్తులు ప్రజల్ని చిత్తు చేస్తున్నాయి.డిసెంబరు 31న దుమ్మురేపాల్సిందేనంటూ ఫోన్లకు వచ్చే సందేశాలు, లింక్‌లు క్లిక్ చేశారా? ఖాతా ఖాళీయే.కొత్త సంవత్సరం కొత్త ఆఫర్లు, కిక్ ఇచ్చే ఆనందం, గుర్తుండి పోయే మూమెంట్ అంటూ క్లిక్ చేశారా ఇబ్బంది పడే అవకాశం ఉందంటున్నారు నగర సైబర్‌క్రైమ్ ఏసీపీ కె.వి.ఎంప్రసాద్.
ఒక్క క్లిక్ తో విదేశీ మద్యం మీ డోర్ వద్దకు, కొత్త సంవత్సరం అంటే ఎలా ఉండాలి డ్యూడ్స్ అంటూ.ఫోన్లకు ఎస్ఎంఎస్ లు, లింక్ లు పంపుతున్నారు.సామాజిక మాధ్యమాల్లో ప్రకటనల మీద ప్రకటనల వర్షం కురిపిస్తున్నారు.డిసెంబర్ 31, జనవరీ 1న మీ ప్రియమైన వారితో గడపండి.ఎంజాయ్ చేయండి.గుర్తుండి పోయేలా ఈ రోజును మల్చుకొండి.
దీనికోసం ముందుగా కొంత అడ్వాన్స్ చెల్లిస్తే సీట్ రిజర్వ్ అవుతుంది.ఇష్టమున్న వారి మదిలో మీ సీట్ కూడా పదిలం అవుతుంది అంటూ ఊరిస్తున్నారు.
మరొక విషయం స్వదేశీ మద్యంతో విసిగిపోయి ఉంటారు.విదేశీ మద్యం ఎంజాయ్ చేయండి.
ఒక్క స్విప్ పోయి స్వర్గంలో ఉంటారు అంటూ ఫ్లాట్ చేస్తున్నారు.ఫ్టాట్ అయితే ఫేయిల్ అవకతప్పదు.
విదేశీ మందేనా.అదేం కర్మ, డీజే, అందమైన అమ్మాయిలు, పంసందైన వంటలు, అన్ లిమిటిడ్ ఆనందం, స్టార్ హోటల్లల్లో ఆతిథ్యం డబ్బుందాం ఇదంతా మీ సొంతమే.
వాటిని అనుభవించేది మీరే.ఆనందం పంచేందుకు మేం ఉన్నాం కదా అంటూ ఊరించి ఊరించి జేబులు గుల్ల చేస్తున్నారు.
ఇప్పటికే ఢిల్లీ, ముంజాయి నగరాల్లో నయాసాల్ కా ఖేల్ ఎంజాయ్ అంటూ కొంతమందిని రిజర్వేషన్ల కోసం ఊరించారు.వాళ్లు నమ్మి డబ్బు కూడా చెల్లించారు.
ఇలాంటి కేసులు ఇప్పటికే రిజిస్టర్ అయ్యాయి రిజర్వేషన్లు అంటూ ఇలాంటి ఆఫర్లు ఇస్తే ఆలోచించండి మోసపోవద్దు అంటూ పోలీస్ లు సూచిస్తున్నారు.
గుర్తుతెలియని ఫోన్‌కాల్స్,సందేశాలకు స్పందించవద్దని ఏసీపీ కె.వి.ఎంప్రసాద్ తెలిపారు.ఆఫర్లంటూ వచ్చే లింకులను క్లిక్ చేయగానే ఎనీడెస్క్, టైమ్‌వ్యూయర్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోమంటారు.ఆ రెండు ల్యాప్‌ట్యాప్‌లోకి చేరితే.మన ఆన్‌లైన్ లావాదేవీలన్నీ మోసగాళ్ల గుప్పిట్లోకి చేరినట్టే.ఒకవేళ మోసపోయినట్టు గుర్తిస్తే వెంటనే 1930 నెంబరులో ఫిర్యాదు చేయండి అని తెలిపారు.
అందుకే పెద్దల మాట సద్దన్నం మూట వినండి జాగ్రత్త పడండి.వినకుండా పెడన చెవిన పెడితే చివరికి మళ్లీ పోలీస్ స్టేషన్ లో లబోదిబో అనాల్సిందే.డబ్బులు తిరిగి వస్తాయో లేవో కూడా తెలీదు.లేదా ఆశలు వదులుకొని కొత్త సంవత్సరం కలిసిరాలేదు.ఈ ఏడాది మాకు బాగాలేదు.మా జాతకం బాలేదు.
పలానా స్వామీజీ చెప్పాడు.పొద్దున టీవీలో వచ్చింది.
పలానా పేపర్ లో వచ్చింది అని మీరు చేసిన తప్పులకే మళ్లీ కొత్త బాధలు తెచ్చుకొని దోషాలు అంటే వేషాలు వేసిన బాబల దగ్గర, స్వామీజీల వద్ద మరింత డబ్బు వెచ్చించకండి.