ప్రపంచం అభివృద్ధి బాటలో ముందుకు దూసుకుపోతున్న క్రమంలో ఇక టెక్నాలజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రోజు రోజుకు వాహనాల వినియోగం పెరుగుతూ పోతుంది.
ఇక మధ్యతరగతి కుటుంబాలకు అందనంత రీతిలో డీజిల్, పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్న క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లో అడుగుపెట్టాయి.
ఇక వాహనదారులంతా డీజిల్, పెట్రోల్ వాహనాలు కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలు కొనడానికే ఇష్టపడుతున్నారు.ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ భారీగా పెరిగింది.ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో కంపెనీలు పోటీ పడుతున్నాయి.
రోజు రోజుకు కొత్త రకాల ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి కంపెనీలు విడుదల చేస్తూనే ఉన్నాయి.అయితే మార్కెట్లో ఏ ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ ఉంటుందో వాటినే కొనడం ఉత్తమం.
టాటా కంపెనీకి చెందిన టాటా నెక్సన్ ఈవీ కారు ఫస్ట్ ప్లేస్ లో ఉంది.కార్ల అమ్మకాల్లో 74% ఈ కార్లే అమ్ముడయ్యాయి.దీని ధర 14.99 లక్షల నుండి ప్రారంభమవుతూ, కేవలం ఒక గంటలోనే 100% బ్యాటరీ రీఛార్జ్ అయ్యి 312 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
ఇక రెండో స్థానంలో ఉన్న టాటా టిగోర్ ఈవీ ఎలక్ట్రిక్ కారు కూడా టాటా కంపెనీకి చెందినదే.గంట లో 100% ఫుల్ చార్జింగ్ చేసుకుని 315 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.
ఎంజి జెడ్ ఎస్ ఈవీ ఎలక్ట్రిక్ కారుకు కూడా మార్కెట్లో డిమాండ్ భారీగానే ఉంది.కేవలం ఒకసారి చార్జింగ్ తో 256 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.ఇక నాలుగో స్థానంలో హుందాయి కొన ఎలక్ట్రిక్ కారు ఉంది.57 నిమిషాలలో 80 శాతం ఫుల్ ఛార్జింగ్ చేసుకుని 452 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.ఇక టాప్ ఫైవ్ లో వోల్వో ఎక్స్ సీ 40 ఎలక్ట్రిక్ కారు ఉంది.ఇది కేవలం 28 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ చేసుకుని 418 కిలోమీటర్లు ప్రయాణించగలదు.