Electric buses india : ఇండియాలో 255 ఎలక్ట్రిక్ బస్సులు.. ఎన్ని రూట్స్‌లో అంటే..

భారతదేశంలో పర్సనల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా వరకు వచ్చాయి కానీ కమర్షియల్ వెహికల్స్ అంతగా అందుబాటులోకి రాలేదు.

కాగా ఈ రంగంలో కూడా వాహనాన్ని తీసుకొచ్చేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి.

ఇందులోని భాగంగా గ్రీన్‌సెల్ ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్‌ లిమిటెడ్ మహిళల కోసం ప్రత్యేకమైన భద్రతా లక్షణాలతో 255 ఎలక్ట్రిక్ బస్సులను అభివృద్ధి చేస్తుంది.ఇందుకోసం ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నుంచి కంపెనీ 40 మిలియన్ డాలర్ల (సుమారు రూ.329 కోట్లు) లోన్ తీసుకుంది.ఈ బస్సులు భారతదేశంలోని 56 రూట్లలో ప్రతి సంవత్సరం 50 లక్షల మందికి రవాణా సేవలను అందిస్తాయి.

ప్రయాణికులు, ముఖ్యంగా మహిళల భద్రతను పెంపొందించడానికి ఇన్‌స్టంట్ రెస్పాన్స్ కోసం కమాండ్ కంట్రోల్‌లకు పానిక్ బటన్‌లు వంటి సెక్యూరిటీ ఫీచర్స్‌ కనెక్ట్‌ అయి ఉంటాయి.మొత్తంమీద, ఈ ప్రాజెక్ట్ సంవత్సరానికి 14,780 టన్నుల ఉద్గారాలను తగ్గిస్తుందని ఒక రిపోర్ట్ తెలిపింది.

"భారతదేశంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రజా రవాణాను డీకార్బనైజేషన్ చేయడం చాలా అవసరం.మహిళా ప్రయాణికుల భద్రతను నిర్ధారించడం చాలా ముఖ్యం" అని ఒక అధికారి పేర్కొన్నారు.

Advertisement

త్వరలోనే అందుబాటులోకి రానున్న ఈ-బస్సులలో భద్రతా ఫీచర్ల కెమెరాలు, పానిక్ బటన్లు, తగిన డిపో లైటింగ్, సీటింగ్ ఏర్పాట్లు, ట్రాకింగ్, అవగాహన పెంచే మెటీరియల్స్‌ ఉంటాయి.మహిళా ప్రయాణికులపై దృష్టి సారించే సేఫ్టీ ప్రోటోకాల్స్ కోసం బస్సు డ్రైవర్లు.క్యాబిన్ హోస్ట్‌లకు శిక్షణ ఇవ్వబడుతుంది.

ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తే ఛార్జీలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.ఎయిర్ పొల్యూషన్ తో పాటు సౌండ్ పొల్యూషన్ కూడా చాలా వరకు తగ్గుతుంది.

ఢిల్లీ, ముంబై వంటి సిటీలలో కాలుష్యం చాలా వరకు తగ్గుముఖం పడుతుంది.

వీడియో: గుర్రాన్ని గెలికిన బుడ్డోడు.. లాస్ట్ ట్విస్ట్ చూస్తే గుండె బద్దలు..
Advertisement

తాజా వార్తలు