ప్రస్తుతం అందరి చేతుల్లోనూ ఫోన్లు కనిపిస్తున్నాయి.ఫోన్ పాడైనా, కొంత సేపు ఫోన్లు మన చేతిలో లేకపోయినా, ఏదో కోల్పోయిన స్థికి చాలా మంది చేరుకుంటున్నారు.మన జీవితంలో ఫోన్లు విడదీయరాని భాగం అయిపోయాయి.మనుషులను దగ్గర చేయాల్సిన ఫోన్లు, మన మధ్య బంధాలను మరింత దూరం చేస్తున్నాయి.ఇక యువత విషయానికొస్తే ఫోన్ చేతిలో ఉంటే చాలు.రకరకాల ఫోజులతో సెల్ఫీలు తీసుకుంటున్నారు.
వెరైటీ సెల్ఫీలు తీసుకుని, వాటిని చకచకా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.ఆపై వాటికి ఎన్ని లైకులు, షేర్లు వస్తున్నాయో చూసుకుని మురిసి పోతున్నారు.ఈ పిచ్చి ఇటీవల కాలంలో ముదిరి పాకాన పడింది.తాజాగా ఓ యువతి ఏకంగా సింహంతో సెల్ఫీ తీసుకుంది.అయితే ఆమెను ఊహించని ప్రమాదం వెంటాడింది.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
ఎవరైనా ‘జూ’లకు వెళ్తుంటే ఊరికే ఉండడం లేదు.అక్కడి జంతువులతో సెల్ఫీలు తీసుకుంటున్నారు.వాటి ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారు.దీంతో కొన్ని జంతువులు విపరీతంగా ప్రవర్తిస్తున్నాయి.
కొన్ని సందర్భాల్లో దాడికి సైతం దిగుతున్నాయి.తాజాగా ఓ యువతి జూకు వెళ్లి సింహంతో సెల్ఫీ దిగింది.
సింహం, ఎలుగుబంటి వంటి జంతువులు ఎన్‌క్లోజర్లు పక్కపక్కనే ఉన్నాయి.సింహంతో ఫొటో దిగాననే సంతోషంలో ఆ యువతి తన పక్కన ఏం జరుగుతుందో గమనించలేదు.
చివరికి ఆమె టీషర్టును ఓ ఎలుగుబంటి బోనులో నుంచి పట్టుకుంది.
దానిని పట్టుకుని లాగింది.దీంతో ఆ అమ్మాయి భయంతో కేకలు పెట్టింది.అదే సమయంలో ఓ జూ ఉద్యోగి అక్కడ ఉండడంతో ఆమెను రక్షించాడు.
దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఆ యువతి ఊపిరి పీల్చుకుంది.ఈ వీడియోను _hasret_kokulum_ అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది.
ఇంకెప్పుడూ సెల్ఫీల కోసం ఆ యువతి ప్రాణాలను పణంగా పెట్టదని కొందరు కామెంట్లు చేస్తున్నారు.జూ వంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలని మరికొందరు సూచిస్తున్నారు.