బస్సుకు వెనక వేలాడుతూ యువకుడు ప్రయాణం.. వీడియో చూస్తే గుండెలు అదురుతాయి..

భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో( Mumbai ) జీవించడం చాలా కష్టంగా ఉంటుంది.అక్కడ రెంట్ రూమ్స్ నుంచి తినే ఫుడ్ వరకు అన్ని ఎక్కువ ధర కలిగి ఉంటాయి.

 The Young Man Is Traveling By Hanging On The Back Of The Bus, Viral News, Latest-TeluguStop.com

అంతేకాదు అక్కడ జనాభా కూడా ఎక్కువే.దీనివల్ల ట్రాఫిక్ ఎక్కువవుతుంది.

పనుల కోసం గ్రామాలు చిన్న పట్టణాల నుంచి ఈ మహా నగరానికి పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు.పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ కూడా సరిపోవు.

అందరూ ఒకరినొకరు తోసుకుంటూ వాహనాల్లో ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

ఆఫీస్, స్కూల్స్ లేదా కాలేజీలకు వెళ్లేవారు ఈ సిటీలో రోజూ కనీసం గంట నుంచి 4 గంటల పాటు బస్సుల్లో ప్రయాణించాల్సి ఉంటుంది.ఉదయాన్నే బస్సులకు మరింత రష్ ఉంటుంది.రద్దీగా ఉండే ఈ బస్సుల్లో సీటు దొరకడం దాదాపు అసాధ్యం.

అయినా సమయానికి పనులకు చేరాలనుకునేవారు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి బస్సుల్లో ట్రావెల్ చేస్తారు.ఇటీవల ముంబైలో ఒక యువకుడు కూడా మరో మార్గం లేక బస్సు వెనుక వేలాడుతూ ప్రయాణం చేశాడు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటన ముంబైలోని బాంద్రా ప్రాంతంలో చోటు చేసుకుంది.బస్సులో ఎక్కడానికి ఎలాంటి చోటు ఉండకపోవడంతో, ఒక యువకుడు బస్సు వెనుక నిచ్చెన పట్టుకుని ప్రయాణించడం ప్రారంభించాడు. అతను బస్సు వెనుక నెంబర్ ప్లేట్ దగ్గర నిలబడి, వెనుక కిటికీ పట్టుకుని ప్రయాణించాడు.

యువకుడు చేసిన ఈ స్టంట్ చూసిన ప్రజలు చాలా పడిపోయారు.ఎందుకంటే అతను ఏ మాత్రం పొరపాటు చేసినా ఘోర ప్రమాదం జరిగి ఉండేది.ఈ వీడియో చూసిన ప్రజలు యువకుడిని నిందించారు.అతను తన ప్రాణాలను పణంగా పెట్టి ఇలాంటి స్టంట్ చేయడం చాలా ప్రమాదకరం అని వారు అన్నారు.ఈ వీడియో చూస్తేనే తమకు గుండెలు అదురుతున్నాయని మరికొందరి పేర్కొన్నారు.ఈ ఘటన ముంబైలోని బస్సు రవాణా వ్యవస్థలో ఉన్న సమస్యలను ఒకసారి మరింత స్పష్టం చేస్తుంది.

రద్దీని తగ్గించడానికి, ప్రభుత్వం బస్సుల సంఖ్యను పెంచడంతో పాటు, రవాణా వ్యవస్థను మెరుగుపరచాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube