సబ్ స్టేషన్ ను నిర్మించారు...ఫెన్సింగ్ ను మర్చిపోయారు...!

సూర్యాపేట జిల్లా:అనంతగిరి మండల( Anantha Giri ) కేంద్రంలో చుట్టుపక్కల గ్రామాలకు విద్యుత్ అందించడం కోసం కొన్నేళ్ల క్రితం విద్యుత్ సబ్ స్టేషన్( Electricity sub station ) ఏర్పాటు చేశారు.

కానీ,ఏళ్లు గడిచినా దానిచుట్టూప్రహరీ గోడ నిర్మించకుండా వదిలేశారు .

దీనితో మేత కోసం అటు వెళ్ళిన ఎన్నో మూగ జీవాలు మృత్యువాత పడ్డాయని స్థానికులు చెబుతున్నారు.విద్యుత్ సబ్ స్టేషన్ పక్కనే తహశీల్దార్ కార్యాలయం ఉండడంతో నిత్యం మండల ప్రజలు వస్తుంటారని,ఎప్పుడు ఏ ప్రమాదం ఎప్పుడు సంభవిస్తుందోనని వారు ఆందోళన చెందుతున్నారు.

The Sub-station Was Built...the Fencing Was Forgotten...!-సబ్ స్టే

ప్రహరీ గోడ లేకపోవడంతో మనుషులకు,మూగజీవాలకు ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా విద్యుత్ శాఖా ఉన్నతాధికారులు స్పందించి ప్రమాదం జరగక ముందే ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ఇదే విషయమై విద్యుత్ ఏఈ కీర్తిని వివరణ కోరగా సబ్ స్టేషన్ కు కావలసిన అన్నివసతులపై, ప్రహరీ గోడకు సంబంధించిన ప్రపోజల్ డిసెంబర్ లో అధికారులకు పంపించామని, త్వరలో ప్రహరీ గోడ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Advertisement

Latest Suryapet News