ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం

ఎన్నికల పోలింగ్ పై పూర్తి అవగాహన పెంపొందిచుకోవాలి ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( District Collector Anurag Jayanthi ) రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎన్నికలలో ప్రిసైడింగ్ అధికారులు,సహాయ ప్రిసైడింగ్ అధికారులది కీలకపాత్ర అని జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి అన్నారు.

మంగళవారం వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం కు సంబంధించి అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనీ జై ఎన్ టి యుకళాశాలలో ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

శిక్షణ కార్యక్రమం జరుగుతున్న తీరును జిల్లా కలెక్టర్‌ అనురాగ్ జయంతి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులకు పలు సూచనలు చేశారు.

పోలింగ్ రోజు పోలింగ్ స్టేషన్ లోపల , వెలుపల కార్యకలాపాల నిర్వహణ, ప్రిసైడింగ్‌ అధికారులు చేయవలసినవి - చేయకూడని అంశాలను కలెక్టర్ వివరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ ఎన్నికల ఘట్టంలో పోలింగ్‌ నిర్వహణ రోజు ముఖ్యమైందని, పోలింగ్‌ దృష్ట్యా చేయాల్సిన అన్ని అంశాలపై ఎన్నికల సంఘం రూపొందించిన హ్యాండ్‌బుక్‌ను ప్రతీ ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు తప్పకుండా చదవడమే కాకుండా, అందులోని అన్ని నియమాలను పాటించాలని కలెక్టర్‌ సూచించారు.

ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం జారీ చేస్తున్న నిబంధనలు, నియమాల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికల పట్ల ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం ఉండవద్దని ఆయన కోరారు.శిక్షణ పొందిన నాటి నుంచి పోలింగ్‌ ముగిసేంత వరకు తీసుకోవా ల్సిన జాగ్రత్తల పట్ల ప్రిసైడింగ్‌ అధికారులుగా విధులు నిర్వహించే వారికి అన్ని అంశాల పట్ల పూర్తి అవగాహన ఉండాలని సూచించారు.

Advertisement

ఎన్నికల విధులకు నియమించబడ్డ ఉద్యోగులు ఎలాంటి పార్టీలకు, అభ్యర్థులకు అనుబంధంగా ఉండకూడదని, ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు జాగ్రత్తగా విధులు నిర్వహించాలని సూచించారు.పోలింగ్‌ ముందు రోజు చేయాల్సిన పనులను చెక్‌లిస్టు తయారు చేసుకొని విధులు నిర్వహించాలనీ చెప్పారు.

ముఖ్యంగా ప్రతి పోలింగ్ ఆఫీసర్ తీసుకోవాల్సిన మెటీరియల్,ఈవీఎంల నిర్వహణ,ఓటరు జాబితా మార్కుడ్ కాపీ,పిఓ,ఏపిఓ డైరీ,వారి విధులు,పోలింగ్ కేంద్రం బయట ప్రదర్శించాల్సిన సామాగ్రి,పోలింగ్ కేంద్రంలోకి అనుమతించే వారు,మాక్ పోల్,ఈవీఎం,వివి ఫ్యాట్ లను ఎలా అనుసంధానం చేయాలి వంటి అన్ని విషయాలు ఒకటికి రెండుసార్లు చదువుకోవాలని అన్నారు.పోలింగ్ నిర్వహణ పై సిబ్బందికి ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ట్రైనర్ లకు సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిబ్బంది సందేశాలను నివృత్తి చేశారు ఫెలిసిటేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ ఫారం-12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకునీ ఎన్నికల పోలింగ్ శిక్షణ కు వచ్చిన పిఓ ,ఏపీఓ ,ఓపిఓ సిబ్బందికి అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లోని జేఎన్టీయూ కళాశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫెలిసిటేషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఎన్నికల సంఘం నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ పోస్టల్ బ్యాలెట్ ఫెలిసిటేషన్ కేంద్రాలలో సిబ్బంది ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట రిటర్నింగ్ అధికారి మధు సూదన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి గంగయ్య, తహశీల్దార్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

చాట్‌జీపీటీ ఉపయోగించి 40 నిమిషాల్లో అదిరిపోయే యాప్ క్రియేట్ చేశాడు.. కానీ..?
Advertisement

Latest Rajanna Sircilla News