నాడు తాళిబొట్టు తాకట్టు పెట్టింది.. నేడు కోట్ల రూపాయల టర్నోవర్.. ఈ మహిళ సక్సెస్ కు గ్రేట్ అనాల్సిందే!

కొంతమంది సక్సెస్ స్టోరీ వింటే సక్సెస్ కోసం ఇంతలా కష్టపడతారా అని అనిపిస్తుంది.బీడీ కార్మికులను బ్యూటీషియన్లుగా తీర్చిదిద్దిన సాకా శైలజ గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెప్పవచ్చు.

 Saka Sailaja Inspirational Success Story Details Here Goes Viral In Social Media-TeluguStop.com

ఒకప్పుడు 1000 రూపాయల అద్దె కట్టడానికి ఇబ్బంది పడిన సాకా శైలజ ఇప్పుడు కోటి రూపాయల టర్నోవర్ పొందే స్థాయికి చేరుకున్నారు.కరీంనగర్ లో రోజాస్ ఇండస్ట్రీ పేరుతో సినోవ్ బ్యూటీ ఉత్పత్తులను తయారు చేస్తున్న సాకా శైలజ సక్సెస్ స్టోరీ ఎంతోమందిని ఆకట్టుకుంటోంది.

Telugu Adilabad, Karimnagar, Nabard, Saka Sailaja, Story-Inspirational Storys

సాకా శైలజ( Saka sailaja ) సంస్థలో పూర్తిగా మహిళా ఉద్యోగులు మాత్రమే పని చేస్తున్నారు.ఈ సంస్థ ఆర్గానిక్ బ్యూటీ ప్రాడక్ట్స్, కెమికల్ హౌస్ క్లీనర్స్ ను తయారు చేయడంతో పాటు గత 20 ఏళ్లలో 30,000 మంది యువతులకు బ్యూటీషియన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది.25 సంవత్సరాల వయస్సులో శైలజ మొదలుపెట్టిన ఈ బిజినెస్ సక్సెస్ స్టోరీ వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయి.శైలజ మాట్లాడుతూ 19 ఏళ్ల వయస్సులో తనకు పెళ్లైందని అన్నారు.

Telugu Adilabad, Karimnagar, Nabard, Saka Sailaja, Story-Inspirational Storys

అదిలాబాద్( Adilabad ) లోని మారుమూల గ్రామంలో మా వారికి టీచర్ గా జాబ్ వచ్చిందని ఆమె తెలిపారు.పెళ్లి కాగానే నేను అటవీ ప్రాంతానికి వెళ్లానని సాకా శైలజ అన్నారు.అక్కడి పిల్లలకు ట్యూషన్ చెబుతూ భర్త కంటే ఎక్కువగా సంపాదించేదానినని శైలజ కామెంట్లు చేశారు. హైదరాబాద్ లో బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నానని ఆమె తెలిపారు.సిరిసిల్లలో ఎంతో కష్టపడి ఇబ్బందులు అధిగమించి బ్యూటీపార్లర్ పెట్టానని శైలజ అన్నారు.పార్లర్ లో పని చేయడానికి వచ్చిన అమ్మాయిలకు బ్యూటీషియన్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ వచ్చేలా చేశానని ఆమె తెలిపారు.

కరీంనగర్ (Karimnagar )కు ట్రాన్స్ పర్ అయిన తర్వాత ఇక్కడ మరో బ్రాంచ్ ను మొదలుపెట్టి మహిళలకు శిక్షణ ఇచ్చానని శైలజ వెల్లడించారు. బ్యాంక్ లోన్ తీసుకుని బ్యూటీ ప్రాడక్ట్స్ ఫ్యాక్టరీ మొదలుపెట్టానని ఆమె అన్నారు.

డబ్బులు లేక పుస్తెల తాడు, కమ్మలు కూడా తాకట్టు పెట్టిన రోజులు ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు.ఏడాదికి కోటి రూపాయల బిజినెస్ జరుగుతుందంటే శైలజ సక్సెస్ స్టోరీ గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube