రేవంత్ రెడ్డిని ఆశీర్వదించిన రాజన్న ఆలయ అర్చకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వా( Sri Raja Rajeshwara Temple )మి ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని ఆశీర్వచనం అందించారు.

ఆలయ అభివృద్ధి పనుల కోసం రూ.50 కోట్లు కేటాయించినందుకు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ( Aadi Srinivas ), ఆలయ అర్చకులు, అధికారులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా రాజన్న ఆలయ విస్తరణ ప్రణాళికలు, నమూనాపై శృంగేరి పీఠం అనుమతి తీసుకోవలసి ఉందని వివరించగా, వెంటనే అనుమతి తీసుకుని అందుకు సంబంధించిన పనులను చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి చెప్పారు.

సీఎంను కలిసినవారిలో వేములవాడ రాజన్న ఆలయ ఈవో వినోద్ , స్థపతి వల్లినాయగం , ఈఈ రాజేష్ , డీఈఈ రఘునందన్ , ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ , ఇతర ముఖ్యులు ఉన్నారు.

మైగ్రేన్ త‌ల‌నొప్పికి కార‌ణాలు.. లైట్ తీసుకుంటే రిస్క్ త‌ప్ప‌దు!

Latest Rajanna Sircilla News