నాణ్యమైన ఓటరు జాబితాయే లక్ష్యం

డూప్లికేట్, పుట్టిన తేదీ తప్పులు సవరించాలి మీ సేవ అప్లికేషన్స్ పెండింగ్ లో ఉండవద్దు కలెక్టర్ అనురాగ్ జయంతి రాజన్న సిరిసిల్ల జిల్లా: నాణ్యమైన ఓటరు జాబితాయే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.

  ఓటరు జాబితాలో సవరణలు, మీ సేవ అప్లికేషన్లు పెండింగ్, కోర్టు కేసులు, ప్రభుత్వ భూముల వివరాల పై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని వీడియో కాన్ఫరెన్స్(వీసీ) హాల్ నుంచి జిల్లాలోని ఆర్డిఓలు, తహసీల్దార్లతో మాట్లాడారు.

ఓటరు జాబితాలో డూప్లికేట్ ఓట్, పుట్టిన తేదీ తప్పుగా పడిన వారి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఫామ్ -7 తీసుకొని సవరణలు చేయాలని, వాటిని ఆన్లైన్లో ఈ నెల 15 వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.ఓటరు జాబితాలో నాణ్యమైన సమాచారం ఉండడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

అనంతరం కులం, ఆదాయం, ఇతర సర్టిఫికేట్ ల జారీలో జాప్యం చేయవద్దని సూచించారు.ఎప్పటికప్పుడు వాటిని జారీ చేయాలని పేర్కొన్నారు.

ఆర్ డి ఓ కార్యాలయాల్లో పుట్టిన తేదీ, మరణ ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో సరైన వివరాలు ఉన్న వాటిని త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.పెండింగ్ దరఖాస్తుల పై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.

Advertisement

కోర్టు కేసుల విషయమై చర్చించారు. దీనిపై ముస్తాబాద్ తహసీల్దార్ సమాచారం ఇవ్వకపోవడంతో మందలించారు.

పూర్తి వివరాలతో తనను కలవాలని పేర్కొన్నారు.అనంతరం ప్రభుత్వ భూముల వివరాల సేకరణ పై మాట్లాడారు.

వీర్న పల్లి మండలంలో ప్రభుత్వ వివరాలను  తహసీల్దార్ ఇవ్వడంతో ఆయనను అభినందించారు.మిగితా తహసీల్దార్లు అందరూ ఆయా శాఖల పరిధిలోని భూముల పై సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు.

వీసీలో అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, ఎస్ డీ సీ గంగయ్య, కలెక్టరేట్ పరిపాలన అధికారి రాంరెడ్డి,పర్యవేక్షకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News