ప్రభుత్వ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చిన జడ్జి

నల్లగొండ జిల్లా:సర్కార్ దవాఖాన( Government Hospital ) అంటే సాధరణంగా ప్రజల్లో కొంత భయం ఉంటుంది.

సరైన వసతులు ఉండక ఇబ్బందులు పడాల్సి వస్తుందని,ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆస్పత్రికి ప్రసవానికి వెళ్ళాలంటే జంకుతారు.

ప్రతి స్త్రీకి ప్రసవం పునర్జన్మతో సమానం.అయినప్పటికి ఆ ప్రసవంతోనే వైద్య,ఆరోగ్య శాఖకు,సాధారణ,మధ్య తరగతి ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలని నల్లగొండ జిల్లా నిడమనూరు కోర్టు జూనియర్ సివిల్ జడ్జి టి.స్వప్న( Junior Civil Judge T.Swapna ) నిర్ణయించుకొని, కార్పొరేట్ స్థాయి వైద్యం అందుకునే స్తోమత ఉన్నా ప్రసవం కోసం తన తల్లిగారింటికి వెళ్ళిన ఆమె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో చేరి, ఆదివారం రాత్రి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.తల్లిబిడ్డా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు.

కొత్తగూడెం జిల్లా కేంద్రం బూడిదగడ్డ బస్తీకి చెందిన న్యాయవాది శాంత కుమార్తె స్వప్నకు నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రానికి చెందిన దాసరి కార్తీక్ తో వివాహమైంది.నిడమానూరు కోర్టులోజూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్న స్వప్న ప్రసవం కోసం కొత్తగూడెంలోని పుట్టింటికి వెళ్లింది.

ఈ సందర్భంగా స్వప్న మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు ఉపయోగించుకోవాలని,పూర్తి నమ్మకంతో వైద్యం పొందాలని సూచించారు.తనకు వైద్య సేవలందించిన డాక్టర్, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

ఈ విషయం తెలిసిన పలువురు ఆమెను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.అప్పోసప్పో చేసైనా సరే ప్రైవేటు దవాఖానకే మొగ్గుచూపుతున్న ఈ రోజుల్లో ఓ జడ్జి సర్కార్ దావఖానలో కాన్పు చేసుకొని అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిందని పబ్లిక్ టాక్.

హైదరాబాద్-విజయవాడ హైవేపై ట్రామా కేర్‌ సెంటర్‌ : కలెక్టర్ సి.నారాయణరెడ్డి
Advertisement

Latest Nalgonda News