రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని భావితరాలకు తెలియజెప్పాలి:ఎస్పీ

సూర్యాపేట జిల్లా:మన హక్కులు మనం పొంది సగర్వంగా జీవిస్తున్నామంటే అది రాజ్యాంగం ద్వారానే సాధ్యమైనదని, భారత రాజ్యాంగం యొక్క విలువను మనం భావి తరాలకు తెలియజెప్పాలని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు.

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా పోలీస్ కార్యాలయం నందు రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహించారు.

దీనిలో భాగంగా మహాత్మా గాంధీ,డాక్టర్ బాబాసాహెబ్ డా.బీ.ఆర్.అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అతి పెద్ద రాజ్యాంగమని,అది రచించిన గొప్ప మహానుభావుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అని,మరెందరో మహానుభావులు రాజ్యాంగ నిర్మాణంలో సేవలు అందించారన్నారు.దేశానికి ప్రభుత్వమనేది సర్వసాధారణమని,ప్రతి ప్రభుత్వానికి రాజ్యాంగం అనేది అతి ముఖ్యమైందన్నారు.

The Greatness Of The Constitution Should Be Conveyed To Posterity: SP-రాజ�

ప్రభుత్వం అనేది శరీరమైతే,రాజ్యాంగం అనేది ఆత్మలాంటిదన్నారు.ప్రభుత్వాలకు దిశానిర్దేశాలు చూపించేది,పౌరులకు హక్కులు, స్వేచ్చా,సమానత్వం కల్పించబడినది ఈ రాజ్యాంగం ద్వారానే అని గుర్తు చేశారు.

ఈరోజున మనం ప్రశాంతంగా, సగర్వంగా జీవిస్తున్నామంటే అది రాజ్యాంగం మనకు కల్పించిన గొప్ప వరమన్నారు.ప్రతి ఒక్కరూ రాజ్యాంగం గురించి తెలుసుకోవాలని,భావితరాలకు తెలియజెప్పాలని అన్నారు.1949 నవంబర్ 26న రాజ్యాంగానికి ఆమోదముద్ర పడినదని,ప్రతీ ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని భారత ప్రభుత్వం 2015 నవంబర్ 19న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు.ప్రతి స్వతంత్ర దేశానికి ఒక రాజ్యాంగం వుండాలని,రాజ్యాంగం అంటే దేశానికి,ప్రజలకు,ప్రభుత్వానికి కరదీపిక వంటిదని,ఆ దీపస్తంభపు వెలుగుల్లో సర్వసత్తాక సౌర్వభౌమాధికార దేశంగా ప్రగతి వైపు అడుగులు వేయాలని సూచించారు.

Advertisement

అందుకనే రాజ్యాంగానికి ఆధునిక ప్రజాస్వామ్య చరిత్రలో అంతటి విశిష్టమైన స్థానముందని,కోట్లాదిమంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రచించడం జరిగిందన్నారు.దానినే ప్రభుత్వాలు అమలు చేయడం జరుగుతుందన్నారు.రాజ్యాంగమంటే కేవలం ప్రభుత్వ విధివిధానాలు,శాసనసభల రూపకల్పనే కాదని,కోట్లాది పీడిత ప్రజల ఆశయాలను ప్రతిబింభించాలన్నది ఆయన ప్రధానాశయమన్నారు.ఆయన కృషి ఫలితంగానే ప్రపంచంలోనే కొత్తదైన రాజ్యాంగం రూపుదిద్దుకుందని, అందుకనే ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాల కంటే భారతరాజ్యాంగం ఉన్నతవిలువలు కలిగిందంటూ మన్ననలు పొందిందని కొనియాడారు.1949 నవంబర్‌ 26న రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిందని,రాజ్యాంగం పీఠిక ప్రజల రోజువారీ జీవితంలో భాగంగా మార్చుకోవాలని ఆకాంక్షించారు.భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం అంకిత భావంతో విధులు నిర్వహిస్తామని డీఎస్పీ రవి ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీలు నాగభూషణం,రవి,ఏఓ సురేష్ బాబు,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ నర్సింహ,సీఐలు సోమనారాయణ సింగ్,రాజశేఖర్,రాజేష్,నాగార్జున,సిసిఎస్ ఇన్స్పెక్టర్ గౌరీ నాయుడు,ఆర్ఐ గోవిందరావు,ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు,సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News