టోల్ ప్లాజాలకు రాం రాం పలకనున్న కేంద్రం.. కానీ .. ?

రోడ్లపై టోల్ ప్లాజాలు లేకుంటే డబ్బులు మిగులుతాయి.రయ్ రయ్ అని దూసుకువెళ్లవచ్చని భావిస్తున్న వారికి పైన టైటిల్ శుభవార్త అనుకుంటారు కావచ్చూ.

కానీ అసలు విషయం ఏంటంటే.ఏడాదిలోపు టోల్ బూత్‌లను తొలగిస్తున్న కేంద్రం, పూర్తి జీపీఎస్ ఆధారిత టోల్ వసూళ్లను అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్‌లో పేర్కొన్నారు.

ఇకపోతే కేంద్రం 2016 లో టోల్ ప్లాజాలలో ఎలక్ట్రానిక్ ఫీజు చెల్లింపును సులభతరం చేసే ఫాస్ట్ ట్యాగ్స్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుండి ఫాస్ట్ ట్యాగ్స్ ను తప్పనిసరి చేశారు.

అయితే ఫాస్ట్ ట్యాగ్ లేని వాహన దారులు మాత్రం డబుల్ టోల్ ఫీజు చెల్లించాలనే రూల్ పెట్టింది.కానీ మరోసారి పురాలోచనలో పడ్ద కేంద్రం దేశంలో ప్రస్తుతం 93 శాతం వాహనాలు ఫాస్ట్‌ ట్యాగ్ ఉపయోగించి టోల్ చెల్లిస్తున్నాయని, అయితే మిగిలిన 7 శాతం మంది డబుల్ టోల్ చెల్లించడం వల్ల వారికి నష్టం వాటిల్లుతుందని భావించి వాటి స్థానంలో జీపీఎస్ ద్వారా టోల్ వసూలు జరపాలని నిర్ణయించిందట.

Advertisement

ఈమేరకు వాహనాలపై (జీపీఎస్ ఇమేజింగ్ ) ఆధారంగా డబ్బు వసూలు చేయబడుతుందని కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పారు.మరి కేంద్రం కీలకంగా తీసుకున్న ఈ నిర్ణయం ఎంతమేరకు ఊపయోగకరంగా ఉంటుందో చూడాలి.

కేవలం ఆ రెండు దేశాలు మాత్రమే న్యూక్లియర్ వార్ తట్టుకోగలవా..?
Advertisement

తాజా వార్తలు