ఇది ఏం బ్రతుకు అంటూ ఎమోషనల్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ప్రముఖం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ( Music Director Taman )గురించి మనందరికీ తెలిసిందే.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ కూడా ఒకరు.

ప్రస్తుతం వరుసగా సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నారు తమన్.ఇక తాజాగా విడుదైనా డాకు మహారాజ్ సినిమాకు అలాగే గేమ్ చేంజర్ సినిమాలకు సంగీతాన్ని అందించిన విషయం తెలిసిందే.

తమన్ పని చేసిన గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ ( game changer, Daku Maharaj )చిత్రాలు ఈ సంక్రాంతికి వచ్చాయి.నెగెటివ్ ట్రెండ్, పనిగట్టుకుని చేసిన ట్రోలింగ్ వల్ల గేమ్ ఛేంజర్‌ పై డిజాస్టర్ ముద్ర పడింది.

ఒక యావరేజ్ బొమ్మగా నిలవాల్సిన గేమ్ ఛేంజర్‌ సినిమాను యాంటీ ఫ్యాన్స్ అంతా కలిసి ఇలా డిజాస్టర్ అని తేల్చేశారు.ఇలాంటి నెగెటివ్ ట్రెండింగ్‌ ల మీద తాజాగా తమన్ స్పందించాడు.

Thaman About Negative Trends On Game Changer At Daaku Maharaj Event, Thaman, Neg
Advertisement
Thaman About Negative Trends On Game Changer At Daaku Maharaj Event, Thaman, Neg

డాకు మహారాజ్ సక్సెస్ మీట్‌ లో తమన్ మాట్లాడిన మాటలు అందరినీ కదిలిస్తున్నాయి.ఈ సందర్భంగా తమన్ మాట్లాడుతూ.సోషల్ మీడియాలో నెగెటివిటీ ప్రభావం ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.

వంద మంది కలిసి అది అబద్దం అని చెబితే, నిజం కూడా అబద్దంలా మారే పరిస్థితి వచ్చింది.సోషల్ మీడియాలో జరిగే ఆర్గనైజ్డ్ ట్రెండ్, ట్రోలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా మీద యాంటీ ఫ్యాన్స్ అంతా కలిసి పని పాటా లేనట్టుగా నెగెటివ్ ట్రెండ్ చేశారు.అంతో ఇంతో పర్వాలేదనిపించేలా ఉన్న గేమ్ ఛేంజర్‌ సినిమాను యావరేజ్ అని కాకుండా డిజాస్టర్ అని ముద్ర వేశారు.

గేమ్ ఛేంజర్ మూవీ ఎంతటి నెగెటివిటీని ఎదుర్కొందో, రామ్ చరణ్ ( Ram Charan )ఎంతలా నెగెటివిటీని మోశాడో అందరికీ తెలిసిందే.

Thaman About Negative Trends On Game Changer At Daaku Maharaj Event, Thaman, Neg
"పోలీస్ అంకుల్.. మా నాన్నను పట్టుకోండి!".. చిన్నోడు కంప్లైంట్‌కు పోలీసులు షాక్!
ఆ ఫ్యామిలీ నట వారసులు ఎందుకు వెనకబడుతున్నారు..?

కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టుగా గేమ్ ఛేంజర్ మీద ఇంతటి నెగెటివిటీ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి.ఇక ఈ గేమ్ ఛేంజర్ మీద పని గట్టుకుని కొన్ని బ్యాచులు నెగెటివ్ ట్రెండ్ చేశాయి.రామ్ చరణ్ నటనకు, సినిమాకు రావాల్సిన గుర్తింపు, దక్కాల్సిన గౌరవాన్ని దక్కకుండా చేశారు.

Advertisement

ఇండస్ట్రీలో ఒక సక్సెస్ ఎంత ఇంపార్టెంట్ ఆ సక్సెస్ వస్తే ఎలా ఉంటుంది.ఆ సక్సెస్ కోసం ఎంతలా ఎంత మంది కష్టపడతారో చెబుతూ తమన్ అందరినీ కదలించాడు.

ఒక నిర్మాత బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది.అలాంటి నిర్మాత ఎంతో కష్టపడి ఒక సినిమాను చేస్తే కావాలనే ఇలా సోషల్ మీడియాలో ట్రోలింగ్, నెగెటివ్ ట్రెండ్ చేసి మన సినిమాల్ని మనమే చంపేస్తున్నాము.

ఇదేం బతుకు అంటూ ఆవేదన చెందాడు.ప్రస్తుతం తెలుగు సినిమా వెలుగుతోంది.

పక్క భాషల నుంచి వచ్చి ఇక్కడ ఒక్క సినిమా అయినా చేయాలని చూస్తున్నారు.అలా మన సినిమాల గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడ మాత్రం ఫ్యాన్స్ అంతా కలిసి ట్రోలింగ్, నెగెటివ్ ట్రెండ్‌ లు అంటూ సినిమాని చంపేస్తున్నారు అంటూ తమన్ కాస్త భావోద్వేగానికి గురయ్యాడు.

డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్‌ లో తమన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.మరి ఇప్పటినుంచి అయినా కొన్ని బ్యాచులు సినిమాలపై నెగటివ్ చేయడం ఆపేస్తారేమో చూడాలి మరి.

తాజా వార్తలు