తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి21, మంగళవారం 2025

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.50

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.05

రాహుకాలం: సా.3.00 సా4.30

అమృత ఘడియలు: సా.అష్టమి మంచిది కాదు.

Advertisement

దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12

రా.10.46 ల11.36

మేషం:

ఈరోజు ప్రారంభించిన పనులు మధ్యలో నిలిచిపోతాయి.ఆర్థిక పరిస్థితి మరింత మందగిస్తుంది.ఇంట బయట దీర్ఘకాలిక సమస్యలు పెరుగుతాయి.

శోభితతో వైవాహిక జీవితం పై చైతన్య షాకింగ్ కామెంట్స్... తన సలహా తప్పనిసరి అంటూ?
కండోమ్ యాడ్ కు ఆ హీరోయిన్ పర్ఫెక్ట్ ఛాయిస్.. బిజినెస్ మేన్ కామెంట్లపై విమర్శలు!

కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏర్పడతాయి.వృత్తి వ్యాపారాలలలో ఆలోచనలు కలసి రావు.

Advertisement

ధన పరమైన విషయాలలో నిదానంగా వ్యవహరించుట మంచిది.

వృషభం:

ఈరోజు ఆప్తుల నుండి వివాదాలకు సంబంధించిన సమాచారం అందుతుంది.చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది.

వృత్తి ఉద్యోగ విషయాల్లో చర్చలు సఫలమౌతాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

మిథునం:

ఈరోజు అకారణంగా ఇతరులతో విరోధాలు కలుగుతాయి.కుటుంబ సభ్యులు మీ మాట విభేదిస్తారు.సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.

వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.వ్యాపారమున విలువైన వస్తువుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.

ఆర్ధిక నష్ట సూచనలున్నవి.

కర్కాటకం:

ఈరోజు కొన్ని వ్యవహారాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి.దూర దేశ సంచారం చేయవలసి వస్తుంది.ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి.

నిరుద్యోగులకు నిరాశ తప్పదు.వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందర పడి మాట్లాడటం మంచిది కాదు.

వ్యాపారాల్లో ఆశించిన రీతిలో లభించవు.

సింహం:

ఈరోజు కుటుంబ సభ్యులతో శుభకార్యలకు హాజరువుతారు.గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్కు ఉపయోగపడతాయి.

విలువైన వస్తువులు సేకరిస్తారు.సంతనానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశములు అందుతాయి.

కన్య:

ఈరోజు ఉద్యోగమున ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.ఇంటా బయట పరిస్థితులు ప్రతికూలిస్తాయి.చేపట్టిన పనులు వాయిదా వేస్తారు.

కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు.వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తప్పవు.

ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

తుల:

ఈరోజు ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది.నూతన విషయాలు సేకరిస్తారు.నూతన కార్యక్రమాలు చేపడతారు.

వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి.గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

ఇతరుల నుండి డబ్బు చేతికి అందుతుంది.

వృశ్చికం:

ఈరోజు బంధు, మిత్రులతో జాగ్రత్తగా వ్యవహారించాలి.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి.

ఉద్యోగమున శ్రమాదిక్యత పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.

ధనుస్సు:

ఈరోజు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు.సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది.

భూ సంభందిత క్రయ విక్రయాల కలసివస్తాయి.వ్యాపారాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది.

మకరం:

ఈరోజు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.కీలక వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు కలిసి వస్తాయి.

వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.ఉద్యోగస్తులకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.

కుంభం:

ఈరోజు ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది.నూతన వస్తు లాభాలు పొందుతారు.చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.ఇంటాబయట నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

మీనం:

ఈరోజు రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది.ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి.నూతన వ్యాపార ప్రారంభానికి అవాంతరాలు కలుగుతాయి.

కుటుంబమున కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది.వృత్తి ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

తాజా వార్తలు