:విద్యుత్ వినియోగంలో తెలంగాణా యావత్ భారతదేశంలోనే మొదటి స్థానంలోనే నిలిచిందని,జాతీయ తలసరి వినియోగంతో పోల్చి చూసినట్లయితే తెలంగాణా రాష్ట్రంలో 69.40 శాతం విద్యుత్ ను ఎక్కువగా వినియోగిస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి( Guntakandla Jagadish Reddy ) అన్నారు.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం వట్టి ఖమ్మం పహాడ్ సబ్ స్టేషన్ ప్రాంగణంలో విద్యుత్ విజయాలపై నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటుతో చీకట్లు మాయమయ్యాయని, తమస్సుల నుండి ఉషస్సులను సృష్టించిన ఘనత ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) దే నన్నారు.
ఉద్యమ సమయంలో నిండు సభలో నాటి పాలకులు మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడితే చీకట్లో మగ్గుతారంటూ తెలంగాణా సమాజంలో గుబులు పుట్టించిన వారే చీకట్లోకిపోయరని ఎద్దేవా చేశారు.రాష్ట్రం ఏర్పడిన రోజున కేవలం 7,778 మేఘావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాలతో ఆ ఉత్పత్తి 18,567 మేఘావాట్లకు చేరుకోవడమే సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధికి నిదర్శనమన్నారు.
ఇందులో గ్రామీణ ప్రాంతంలో పనిచేసే సిబ్బంది మొదలుకొని యాజమాన్యాల వరకు అందరి శ్రమ ఉందని మంత్రి ప్రశంసించారు.ఉమ్మడి అంధ్రప్రదేశ్ లో పీక్ డిమాండ్ సమయంలో 13,000 మేఘావాట్లు ఉండగా ఇప్పుడు ఒక్క తెలంగాణా ప్రాంతంలోనే పీక్ డిమాండ్ సమయంలో నమోదైన 14,700 మేఘావాట్లే విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతికి అద్దం పడుతుందన్నారు.యావత్ భారతదేశం నుండి తెలంగాణకు విద్యుత్ ట్రాన్స్ మిషన్( Electricity transmission to Telangana ) కు తగిన వెసులుబాటు ఉందని తెలిపారు.2014 కు పూర్వం ఎందుకు 24 గంటల ఇవ్వలేక పోయారని,అది ఇప్పుడు ఎలా సాధ్యమైందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచన చెయ్యాలని విజ్ఞప్తి చేశారు.విద్యుత్ సంక్షోభంతో ఎండిపోయిన పంట పోలాలను చూసి తట్టుకోలేక రైతుల ఆత్మహత్యలు చేసుకుంటే,దాంతో కుటుంబ సభ్యుల ఆత్మక్షోభతో క్రాప్ హాలిడేస్ తో రోడ్డెక్కిన పరిస్థితి ఒకవైపు ఉందని, మరోవైపు పారిశ్రమిక వేత్తల ఆందోళనలతో అట్టుడికి పోయిన దుర్బర పరిస్థితుల నుండి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేసేదాక చేరుకున్నామంటే అది ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనా విదానమేనన్నారు.
అటువంటి మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్ తోమ్మిదేళ్లలో సాధించిన అభివృద్ధి ఏమిటని విమర్షలు చేసే వారికి విద్యుత్ రంగంలో సాధించిన విజయాలు చెంపపెట్టు లాంటిదన్నారు.
Latest Suryapet News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy