CM Revanth Reddy : ప్రజా సమస్యలపైనే ప్రజా ప్రభుత్వం దృష్టి..: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) నియామక పత్రాలు అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు.

గతంలోని బీఆర్ఎస్( BRS ) పాలనలో యువతకు తీరని అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.గత ప్రభుత్వం ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టలేదన్న సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందని ఆరోపించారు.

అయితే నియామక పత్రాలు తీసుకున్న సమయంలో ప్రజల సంతోషంలో పాలుపంచుకోవాలనే ఆలోచనతో అందరినీ పిలిపించామని రేవంత్ రెడ్డి తెలిపారు.గతంలో కేసీఆర్( KCR ) కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయన్నారు.కానీ తెలంగాణలోని నిరుద్యోగులను మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు.

అందుకే కేసీఆర్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రజలు ఇంటికి పంపించారని వెల్లడించారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు