ఏపీ మహిళల భద్రతకు పెనుముప్పు.. ఆ యాప్ తో టీడీపీ అనైతిక చర్యలకు పాల్పడుతోందా?

ఏపీలో ఎన్నికలు జరగడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.సరిగ్గా ఎన్నికల సమయంలో టీడీపీకి సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

టీడీపీ అనైతిక చర్యలకు పాల్పడుతోందని పొలిటికల్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది."WeApp" పేరుతో తెలుగుదేశం రాష్ట్రానికి చెందిన మహిళల వివరాలను సేకరించిందని తెలుస్తోంది.

మహిళల వయస్సు, ఇతర కీలక వివరాలను ఆ యాప్ లో పొందుపరిచారని సమాచారం అందుతోంది.

ఈ యాప్ తో ఏపీ మహిళల భద్రతకే పెనుముప్పు అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ఎప్పుడూ తమ పత్రికల ద్వారా సమాజానికి నీతులు చెప్పే టీడీపీ( TDP ) ఇప్పుడు అనైతిక చర్యలకు పాల్పడుతూ వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.గతంలో వాలంటీర్లు మహిళల సమాచారం సేకరించడం వల్ల కిడ్నాప్ లు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

టీడీపీ మహిళల పూర్తి వివరాలను సేకరించడాన్ని పవన్ కళ్యాణ్ ఏ విధంగా సమర్థించుకుంటారో అని కామెంట్లు వినిపిస్తున్నాయి.మహిళల ఊరు, వయస్సు అడ్రస్ లాంటి వివరాలతో టీడీపీకి పని ఏంటని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు ఈ విధంగా ప్రజల సమాచారం సేకరించడం ఇదే తొలిసారి కాదు.

గతంలో ప్రజా సాధికార సర్వే పేరుతో వివరాలను సేకరించిన టీడీపీ సేవా మిత్ర యాప్‌లో ఆ వివరాలను పొందుపరిచింది.వీ యాప్ సేవా మిత్ర యాప్ కు అప్ డేటెడ్ వెర్షన్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఆధార్, ఫోన్‌ నంబర్లు, ఓటరు ఐడీ నంబర్లు, వృత్తి, అడ్రస్ ఇతర వివరాలను సైతం ఈ యాప్ లో పొందుపరిచారని తెలుస్తోంది.ఈ విధంగా సమాచారాన్ని సేకరించడాన్ని బాబు, టీడీపీ నేతలు ఎలా సమర్థించుకుంటారో చూడాల్సి ఉంది.

ప్రజల ప్రైవసీకి భంగం కలిగించేలా టీడీపీ వ్యవహరిస్తోంది.టీడీపీ ఓటర్ల స్లిప్పులతో ప్రత్యేక బార్‌కోడ్‌ ఉన్న కరపత్రాల పంపిణీ చేయడం హాట్ టాపిక్ అవుతోంది.

ఈటెల ఆ పదవి కన్నేశారా ? అసంతృప్తితో రగిలిపోతున్నారా ?
పవన్ కళ్యాణ్ ఆ సినిమా పై ఫోకస్ చేసిన అకీరా... ఆత్రుతగా ఉందంటూ?

బార్‌కోడ్‌ స్కాన్‌ చేయగానే హైదరాబాద్‌ నుంచి డబ్బులు డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.నియోజకవర్గానికి రూ.87.50 కోట్ల చొప్పున టీడీపీ డిజిటల్‌ చెల్లింపులు చేస్తున్నట్టు తెలుస్తోంది.ఈ ప్రచారం గురించి టీడీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు