ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా పొత్తు పెట్టుకున్న టీడీపి, జనసేన పార్టీలు( TDP , Jana sena ) దూకుడుగానే నిర్ణయాలు తీసుకుంటూ కలిసికట్టుగా ఉమ్మడి పోరాటాలు , ఎన్నికల ప్రచారాలు చేపట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో దాదాపుగా ఖరారు అయింది.
మేనిఫెస్టో కమిటీ ఇచ్చిన అంశాలపై టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు.ఇది పూర్తయిన తర్వాత రేపటి నుంచి అంటే నవంబర్ 17 నుంచి 11 అంశాలతో ఉమ్మడిగా ఏపీలోని ప్రతి ఇంటికి వెళ్లి రెండు పార్టీలు కలిసి ప్రచారం నిర్వహించబోతున్నాయి .అలాగే నవంబర్ 18 నుంచి ఉమ్మడి పోరాటాలు చేపట్టేందుకు రెండు పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి.ఇప్పటికే టిడిపి జనసేన ఉమ్మడి మేనిఫెస్టో పై ఒక క్లారిటీ రావడంతో ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ప్రతిపాదనలు రెండు పార్టీల అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆమోదం కోసం పంపించారు.
ఈ ప్రతి పాదనలపై దాదాపుగా రెండు పార్టీల నేతలు అంగీకారం తెలపడంతో , ఈరోజు అది ఆమోదముద్ర పడగానే, ఏపీలోని ప్రతి ఇంటికి వెళ్లి ఉమ్మడి మ్యానిఫెస్టోలో ని ప్రతి అంశాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంతో పాటు, వైసిపి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు వివరించే విధంగా ప్రణాలికలు రూపొందించుకున్నారు.కొద్దిరోజుల క్రితమే టిడిపి కేంద్ర కార్యాలయంలో సమావేశమైన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ రెండు పార్టీల నుంచి ఆరేసి అంశాలను ప్రతిపాదించింది. రాజమండ్రి మహానాడులో టిడిపి సూపర్ సిక్స్ పేరుతో హామీలను ప్రకటించింది .మహిళల కోసం మహాశక్తిలో భాగంగా తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉన్నప్పటికీ, ఒక్కొక్కరికి 15000 చొప్పున ఆర్థిక సహాయం, ఆడబిడ్డ నిధి నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 దీపం పథకం పేరుతో ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీను ఇచ్చింది. అలాగే రైతుల కోసం అన్నదాత పథకం కింద ప్రతి ఏటా 20వేల ఆర్థిక సాయం, ఆక్వా , ఉద్యాన రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తామని పేర్కొన్నారు.
యువత కోసం యువ గళం కింద నిరుద్యోగులకు నెలకు 3000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. అలాగే బీసీలకు రక్షణ చట్టం, ఇంటింటికి మంచినీరు వంటి అంశాలతో మేనిఫెస్టోను ప్రకటించారు.ఇక జనసేన రైతులకు సంబంధించి కవులు రైతులకు ఏడాది 20వేల ఆర్థిక సహాయం ఉమ్మడి అంశంగా చేర్చారు .మరో ఐదు అంశాలను కొత్తగా చేర్చారు. జనసేన ప్రతిపాదించిన ఐదు అంశాల్లో సౌభాగ్య పథకం కింద కొత్త పరిశ్రమలు స్థాపించే యువతకు 20 శాతం లేదా గరిష్టంగా 10 లక్షల వరకు ఆర్థిక సహాయం, ఉచిత ఇసుక విధానం పునరుద్ధరించి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని మరో ప్రతిపాదనను చేర్చారు .అలాగే ఏపీకి అమరావతి ( Amaravati )ఒకటే రాజధాని, సంపన్న ఆంధ్రప్రదేశ్ కింద ప్రజలపై ఆర్థిక భారం తగ్గించడం, కార్మికుల సంక్షేమం, వలసల నిరోధం, కనీస వేతనాల పెంపు వంటి అంశాలను చేర్చారు.వీటిని హైలెట్ చేసే విధంగానే రెండు పార్టీలు జనం బాట పట్టనున్నాయి .