మాంసాహార ప్యాకెట్లు పంచిన వారిపై చర్యలు తీసుకోండి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో బుధవారం సాయంత్రం కొంతమంది వ్యక్తులు మాంసాహారంతో కూడిన భోజన ప్యాకెట్లను అందజేయడంపై బాధ్యులైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆలయ ఈవో వినోద్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

అంతేకాకుండా హిందూ మతానికి చెందిన భక్తుల మనోభావాలకు భంగం వాటిల్లడం పట్ల రాజన్న ఆలయ సన్నిది తో పాటు గుడి చెరువు పరిసరాలు, ఆలయ పశ్చిమ వైపున ఆలయ అర్చక బృందం ఆధ్వర్యంలో పుణ్య వచన, సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

Take Action Against Those Who Distribute Meat Packets, Meat Packets, Rajanna Si

Latest Rajanna Sircilla News