గుర్రంపోడు మండలం మొసంగిలో వ్యక్తి అనుమానాస్పద మృతి

నల్లగొండ జిల్లా: గుర్రంపోడు మండలం మొసంగి గ్రామానికి చెందిన నడ్డి శ్రీను(40) ఆదివారం రాత్రి ఊరి చివర ముత్యాలమ్మ గుడి దగ్గర అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

సోమవారం మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి,అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని,పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు గుర్రంపోడు ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు.

Suspicious Death Of A Person In Gurrampodu Mandal Mosangi, Suspicious Death, Gur

Latest Nalgonda News