అక్కినేని కాంపౌండ్‌లో మరో హీరోకు గాయాలు

ఇటీవల అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్ర షూటింగ్‌లో గాయపడ్డాడని, అతడికి డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలని సూచించడంతో చిత్ర షూటింగ్‌ను వాయిదా వేసిన విషయం తెలిసిందే.ఈ వార్త ఇంకా అందరికీ తెలియకముందే, మరో అక్కినేని ఫ్యామిలీకి చెందిన హీరో గాయాలపాలయ్యాడు.

 Sushanth Injured In No Parking Sets-TeluguStop.com

యంగ్ హీరో సుశాంత్ ఇటీవల అల వైకుంఠపురములో చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమా సక్సెస్‌తో తన నెక్ట్స్ మూవీని ఇటీవల స్టార్ట్ చేశాడు ఈ హీరో.

‘నో పార్కింగ్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు సుశాంత్.అయితే ఈ చిత్ర షూటింగ్ సమయంలో అతడికి గాయాలు అయినట్లు తెలుస్తోంది.

దీంతో ఈ సినిమా షూటింగ్‌ను కూడా వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాతో ఎస్.దర్శన్ అనే దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు.హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి అనే అమ్మాయి కూడా ఈ సినిమాతో పరిచయం అవుతుంది.

మరి ఈ సినిమాతోనైనా సుశాంత్ హీరోగా సక్సెస్ కొడతాడో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube