పెళ్లిసందడి శ్రీలీల నా కూతురు కాదు.. వ్యాపారవేత్త సంచలన వ్యాఖ్యలు?

ఈ నెల 15వ తేదీన విడుదలైన పెళ్లిసందడి సినిమాలో హీరోయిన్ గా నటించి శ్రీలీల మంచి పేరును సంపాదించుకున్నారనే సంగతి తెలిసిందే.

సినిమాకు మంచి టాక్ రాకపోయినా హీరోయిన్ పర్ఫామెన్స్ బాగుందని కామెంట్లు వచ్చాయి.

అయితే ప్రముఖ బిజినెస్ మేన్ లలో ఒకరైన సూరపనేని శుభాకరరావు తన కూతురు శ్రీలీల అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని కామెంట్లు చేశారు.శ్రీలీల తన మాజీ భార్య కూతురు అని ఆయన చెప్పుకొచ్చారు.

తాను భార్యతో విడిపోయిన తర్వాత శ్రీలీల పుట్టిందని తన ప్రాపర్టీస్ ను క్లెయిమ్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే తన పేరును వాడుతున్నారని సూరపనేని శుభాకరరావు కామెంట్లు చేశారు.తనకు, తన భార్యకు మధ్య విడాకుల విషయంలో కేసులు నడుస్తున్నాయని ఆయన వెల్లడించారు.

శ్రీలీల తన కూతురు అని జరుగుతున్న ప్రచారం గురించి న్యాయపరంగా ముందుకు వెళతామని సూరపనేని శుభాకరరావు చెప్పుకొచ్చారు.

Advertisement

ఇప్పటికే ఈ ప్రచారం గురించి సూరపనేని సొసైటీకి కూడా ఫిర్యాదు చేశానని శుభాకరరావు పేర్కొన్నారు.సూరపనేని శుభాకరరావు కామెంట్ల గురించి శ్రీలీల ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.మరోవైపు శ్రీలీలకు కొత్త సినిమా ఆఫర్లు బాగానే వస్తున్నాయని తెలుస్తోంది.

పెళ్లిసందడి సక్సెస్ సాధించి ఉంటే శ్రీలీల కెరీర్ కు ప్లస్ అయ్యి ఉండేది.తెలుగులో హీరోయిన్ల సంఖ్య తగ్గడంతో కొత్త హీరోయిన్లకు అవకాశాలు పెరుగుతున్నాయి.

శ్రీలీల కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఆమెకు మరిన్ని ఎక్కువ ఆఫర్లు వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.శ్రీలీల సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది.

శ్రీలీల ఊహించని వివాదం వల్ల వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.  శ్రీలీల తల్లి ఈ వివాదం గురించి స్పందించి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తారేమో చూడాల్సి ఉంది.

వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !
Advertisement

తాజా వార్తలు