SBI Electoral bonds case: ఎలక్టోరల్ బాండ్ల కేసులో ఎస్బీఐ పిటిషన్ సుప్రీంలో కొట్టివేత

ఎలక్టోరల్ బాండ్ల కేసులో( Electoral bonds case ) ఎస్బీఐ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

బాండ్ల వివరాలు వెల్లడించేందుకు గడువు పొడిగించాలన్న భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.

అయితే రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించే ఎన్నికల బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు( Supreme Court ) గత నెలలో రద్దు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో బాండ్ల జారీని తక్షణమే ఆపేయాలని ఎస్బీఐని ఆదేశించింది.

దాంతోపాటుగా బాండ్ల ద్వారా పార్టీలకు అందిన నగదు, ఇచ్చిన దాతల వివరాలను ఈ నెల 6లోగా ఎన్నికల సంఘానికి అందించాలని కీలక ఆదేశాలు ఇచ్చింది.

అనంతరం సమాచారాన్ని పబ్లిక్ డొమైన్( Public domain ) ద్వారా ఈ నెల 13 లోగా బహిరంగపరచాలని ధర్మాసనం స్పష్టం చేసింది.అయితే తక్కువ సమయంలో ఈసీకి సమాచారం ఇవ్వడం కష్టమన్న ఎస్బీఐ వివరాలను( SBI ) వెల్లడి చేయడానికి జూన్ 30వ తేదీ వరకు గడువు పొడిగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఎస్బీఐ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీం ధర్మాసనం పిటిషన్ ను కొట్టివేసింది.

Advertisement

ఎలక్టోరల్ బాండ్ల వివరాలను రేపు ఈసీకి( ec ) అందజేయాలని సుప్రీంకోర్టు ఎస్బీఐకి ఆదేశాలు జారీ చేసింది.అదేవిధంగా ఈనెల 15 వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు బాండ్ల వివరాలను ఈసీ వెబ్ సైట్ లో ఉంచాలని వెల్లడించింది.

మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
Advertisement

తాజా వార్తలు