జగడం కాంబినేషన్ రిపీట్... 13 ఏళ్ల తర్వాత మళ్ళీ

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ దర్శకుడుగా సుకుమార్ తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు.అయితే అతని మొదటి సినిమా ఆర్య తర్వాత సుకుమార్ హీరో రామ్ తో జగడం అనే సినిమా చేశాడు.

 Sukumar Plan To Movie With Hero Ram, Tollywood, Telugu Cinema, Red Movie, Bunny,-TeluguStop.com

నెగిటివ్ హీరోయిజంతో టాలీవుడ్ లో ఫస్ట్ టైం డిఫరెంట్ కంటెంట్ తో వచ్చిన ఆ సినిమాని తెలుగు ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేదు.అప్పటికి తెలుగులో యాంటీ హీరోయిజంకి తెలుగు ప్రేక్షకులు అలవాటు పడకపోవడంతో సుకుమార్ ప్రయోగం ఫెయిల్ అయ్యింది.

అయితే ఈ రోజుల్లో అలాంటి కంటెంట్ వచ్చి ఉంటే మాత్రం సూపర్ హిట్ అయ్యేది.

ఇలా అడ్వాన్స్ థాట్స్ తో సినిమాలు తీసే సుకుమార్ ప్రస్తుతం బన్నీతో మూడో సారి సినిమా తీస్తున్నాడు.

వీరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి, రెండు సినిమాలు ఆర్య, ఆర్య 2 ఎంత సూపర్ హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే.ఈ నేపధ్యంలో ప్రస్తుతం రాబోతున్న సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మరల సుకుమార్ హీరో రామ్ తో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తుంది.గతంలో సుకుమార్ జగడం ఇప్పుడు తీస్తే మంచి హిట్ అయ్యి ఉండేది అంటూ చాలా సార్లు కామెంట్స్ చేశారు.

ఈ నేపధ్యంలో ఇంచుమించు అలాంటి కథతోనే మరల రామ్ ని ఒప్పించి సినిమాకి రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తుంది.బన్నీ సినిమా అయిపోయిన వెంటనే రామ్ తో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి సుకుమార్ రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube