ఫైలిఫీన్స్ లో తెలుగు వైద్య విద్యార్ధి మృతి..!!!

విదేశాలలో ఉన్నత చదువులు చదివి ఆర్ధికంగా స్థిరపడాలని ఎంతో మంది భారతీయులు తమ సొంత ఊళ్ళని వదులుకుని , తల్లి తండ్రులకి దూరంగా ఉంటూ, ఎంతటి ఇబ్బందులు ఉన్నా విదేశాలలో చదువుకోవడానికి వెళ్తారు.

అక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ, మరో పక్క చదువుకుంటూ తమ కలలు నెరవేరాలని తల్లి తండ్రులని బాగా చూసుకోవాలని ఆరాటపడుతుంటారు.

కానీ విధి కొంతమంది కలలని నెరవేర్చక పోగా వారిని కానరాని లోకాలకి తీసుకుపోతుంది.వారి తల్లి తండ్రులకి శాశ్వతంగా దూరం చేస్తుంది.

ఇలాంటి సంఘటనే ఇప్పుడు ఫైలిఫీన్స్ లో చోటు చేసుకుంది.వెటర్నరీ వైద్య విద్యని అభ్యసించడానికి ఫైలిఫీన్స్ వెళ్ళిన ఓ విద్యార్ధి అక్కడి రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

మూడేళ్ళ కోర్సు పూర్తి చేసుకుని ఇంకొక ఏడాది లో తమ ఇంటికి వచేస్తాడని అనుకున్న ఆ తల్లి తండ్రుల ఆశలు అడియాశలు అయ్యాయి.కృష్ణా జిల్లా నందిగామలోని నేతాజీ నగర్ కి చెందిన పొన్నపల్లి జగదీశ్ అనే యువకుడు వైద్య విద్య కోసం 2016 లోనే ఫైలిఫీన్స్ వెళ్ళాడు.

Advertisement

ప్రస్తుతం నాలుగో ఏడాది చదువుతున్న జగదీష్ సోమవారం రోజున షాపింగ్ కి తన ద్విచక్ర వాహనం పై వెళ్తున్న సమయంలో వెనుక నుంచీ వచ్చిన బస్సు అతడిని బలంగా డీ కొట్టడంతో ఒక్క సారిగా అతడు గాలిలో పల్టీలు కొట్టి తీవ్రంగా గాయపడ్డాడు.హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడని తెలుస్తోంది.

మట్టి ఇల్లు అని చులకనగా చూడకండి.. లోపల చూస్తే ఇంద్రభవనమే..?
Advertisement

తాజా వార్తలు