డ్రగ్స్, గంజాయి నివారణలో విద్యార్థులు భాగస్వాములు కావాలి

నాశ ముక్త్ భారత్ అభియాన్( Nasha Mukti Abhiyan ) కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్(SP Akhil Mahajan) ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పాఠశాల, కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే పరిణామాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది.

అందులో భాగంగా అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమనికి అదనపు ఎస్పీ చంద్రయ్య గారు హాజరై విద్యార్థులకు మాధకద్రవ్యాల వలన కలుగు అనర్ధాలపై దిశ నిర్దేశం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.డ్రగ్స్ నిర్ములనకోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై డ్రగ్స్ మహమ్మరిని నిర్ములించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దాం అని, యవత ,విద్యార్థులు మత్తు పదార్థాలకు,గంజాయికి దూరంగా ఉంటూ భవిష్యత్తు లో ఉన్నత స్థానాల్లో ఉండాలన్నారు.

విద్యార్థులు,యువత మత్తు పదార్థాలకు మానసికగా బానిస కావడం ద్వారా అనుకోకుండా నేరాలు చేసే అవకాశం ఉందని,కావున డ్రగ్స్,గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో ఉన్నత లక్ష్యాల ను సాదంచాలన్నారు.డ్రగ్స్, మత్తు పదార్థాలు, గంజాయికి సంబంధించిన సమాచారం డయల్ -100,టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ 87126 56392 ,లేదా మీ పరిధిలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుదన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు మత్తు పదార్థాలు సేవించడం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వీడియోల ద్వారా అవగాహన కల్పించిన అనంతరం వారితో ప్రతిజ్ఞ చేపించారు.ఈ కార్యక్రమంలో సి.ఐ శ్రీనివాస్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం,కళాశాల ప్రిన్సిపాల్ రాజగోపాల్, ఎస్.ఐ అంజయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News