రాష్ట్ర స్థాయికి ఎంపికైన కరివిరాల మోడల్ స్కూల్ విద్యార్థి ప్రాజెక్ట్

సూర్యాపేట జిల్లా: నడిగూడెం మండల పరిధిలోని కరివిరాల మోడల్ స్కూల్లో పదవతరగతి విద్యార్థి పృథ్వి తయారు చేసిన "లైఫ్ సేవింగ్ స్టిక్" ఇన్స్పైర్ ప్రాజెక్ట్ రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు జిల్లా సైన్స్ అధికారి దేవరాజు తెలిపారు.

ఈ ప్రాజెక్టు వల్ల రైతులకు రాత్రిపూట పొలాల వద్ద పనిచేసే రైతులు పాముకాటు బారిన పడకుండా ఎంతో మేలు చేస్తుందని తెలిపారు.

తమ స్కూల్లో చదువుతున్న విద్యార్థి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావటం పట్ల మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ షరీఫ్, ఉపాధ్యాయ బృందం, సిబ్బంది,విద్యార్థులు,మండలంలోని పలువురు ప్రముఖులు పృథ్విని అభినందించారు.

Student Project Of Karivirala Model School Selected For State Level, Student Pro

Latest Suryapet News