తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసే వారి పై కఠిన చర్యలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )లో సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న అంశం వేరే రాష్ట్రాలకు చెందిన వారు మన జిల్లాలో గ్రామాలలో, పట్టణాల్లో తిరుగుతూ చిన్న పిల్లలను ఎత్తుకెల్లుతున్నారన్న పోటోలు, వీడియోస్ పోస్టు చేస్తున్న ప్రచారం నిజం కాదని ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని,వేరే ప్రాంతాల్లో జరిగిన సంఘటనలకు సంబంధించిన విడియోస్, పోటోలు జిల్లాలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేయద్దని జిల్లా ఎస్పీ తెలిపారు.

సోషల్ మీడియా( Social media )లో గత రెండు రోజులుగా వస్తున్న చిన్న పిల్లల కిడ్నప్ లకు సంబంధించిన సమాచారం కానీ,ఫిర్యాదులు ,ఆధారాలు కానీ పోలీస్ వ్వారికి అందలేదని,రోజు వారిగా జిల్లా అంతటా నిరంతరం నిఘా ఉంచి గస్తీ నిర్వహిస్తున్నామని, పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లో బ్లూ కోల్ట్ వాహనాలు 24/7 పెట్రోలింగ్ నిరహిస్తున్నాయని, జిల్లాలోకి ప్రవేశించే అన్ని రహదారులలో, పట్టణాలలో సీసీ కెమెరాల నిఘా ఉందన్నారు.

సోషల్ మీడియా లో వస్తున్న పుకార్లు నిజం కాదని వాటిని ఎవ్వరు నమ్మొద్దు, ఇలాంటివి సంఘటనలు జరిగిన, సమాచారం ఉన్న సంబంధిత పోలీస్ అధికారులకు లేదా డయల్ 100 కు కాల్ చేసి సమచారం అందిస్తే పోలీస్ వారు వాస్తవాలను విచారించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.ఎక్కడో జరిగిన సంఘటనలు జిలాల్లో జరిగినట్టు సోషల్ మీడియాలో తప్పుడు పుకార్లను పోస్ట్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిపై కూడా పోలీస్ నిఘా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.

చాట్‌జీపీటీ ఉపయోగించి 40 నిమిషాల్లో అదిరిపోయే యాప్ క్రియేట్ చేశాడు.. కానీ..?

Latest Rajanna Sircilla News