పాపులర్ టాలీవుడ్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు ( D.Ramanaidu )సినిమాలను నిర్మించడమే సొంత సినిమాల్లో నటిస్తుంటాడు.ఆయన తన సినిమాల్లో ఏదో ఒక చిన్న వేషంలో కనిపించి మెప్పిస్తుంటాడు.
డాక్టర్ గా, పోలీస్ ఆఫీసర్ గా, వ్యాపారవేత్తగా ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల పాత్రల్లో ఆయన నటించాడు.అయితే 1968 లో వచ్చిన “పాప కోసం” సినిమాలో( papa kosam ) రామానాయుడు పెళ్ళికొడుకుగా కనిపించి విజయనిర్మలను పెళ్లి చేసుకున్నాడు.
ఈ సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలు చాలానే ఉంటాయి.అందులోని సెంటిమెంట్ సీన్లకు ఎవరైనా సరే కంట తడి పెట్టుకోవాల్సిందే.ఈ సినిమాలో చిన్న పాప ముగ్గురు కరుడు గట్టిన హంతకులను మార్చేస్తుంది.
ఆ పాప మనుషుల పట్ల ప్రేమ చూపించేలా హంతకులను మారుస్తుంది.వారిని చెడ్డ మనుషుల నుంచి మంచి మనుషులుగా మార్చి పోలీసులకు లొంగిపోయేలా చేస్తుంది.ఆ పాప పెద్దయిన తర్వాత పెళ్లి చేసుకుంటుంది.
పాప ఓల్డర్ వెర్షన్‌ను విజయనిర్మల ( Vijayanirmala )పోషించింది.విజయనిర్మల ఒక అతిధి పాత్ర మాత్రమే.
ఇందులో సూపర్ స్టార్ కృష్ణ( Superstar Krishna ) కూడా ఒక గెస్ట్ రోల్ చేశాడు.కృష్ణ విజయనిర్మలకు తండ్రిగా నటించాడు.
అతడిని చంపేసి నగలు, డబ్బులను హంతకులు ఎత్తుకెళ్తారు.పాపను కూడా వారితో పాటే తీసుకెళ్తారు.
ఆ హంతకులుగా సత్యనారాయణ, త్యాగయ్య, రామదాసు యాక్ట్ చేశారు.ఈ ముగ్గురు హంతకుల్లో ఒక్కొక్కరు ఒక్కో క్యాస్ట్ కు చెందినవారు.
ఒకరు హిందువైతే, మరొకరు ముస్లిం, ఇంకొకరు క్రైస్తవుడు.వీరందరికీ దైవభక్తి ఉంటుంది.
పాపలోనే తమ ఇష్టదైవాన్ని వారు చూసుకుంటారు.
పెండ్యాల నాగేశ్వరరావు( Pendyala Nageswara Rao ) ఈ సినిమాకి సంగీత బాణీలు సమకూర్చాడు.ఉల్లిపూల పడవా గట్టి మావా మల్లెపూల తెరను దించి, కొండలపైన కోనలలోన గోగుల వంటి ఇందులోని పాటలు చాలా మెలోడియస్ గా సాగుతాయి.ఇందులో డాన్సులు కూడా బాగానే ఉంటాయి.
హిందీ యాక్ట్రెస్ మధుమతి మూవీలో( Madhumati movie ) అదిరిపోయే స్టెప్పులు వేసింది.కృష్ణ కూడా ఇందులో స్టెప్పులు వేశాడు.
అయితే అతడు పాట లేకుండానే డాన్స్ చేసి అబ్బుర పరిచాడు.సాంగ్ లేకుండా అదిరిపోయే డాన్స్ చేయడం ఒక్క కృష్ణకి మాత్రమే చెల్లిందని చెప్పుకోవాలి.
విజయనిర్మల కూడా అతడితో కలిసి కాలు కదిపింది.ఈ సినిమా తెలుగులో మంచి హిట్ కావడంతో తమిళంలో కూడా దీనిని నిర్మించాడు డి రామానాయుడు.
అక్కడ కూడా ఈ మూవీ హిట్ అయింది.