ఆగమవుతున్న అడ్డా మీది బ్రతుకులు

సూర్యాపేట జిల్లా:అందమైన భవనాలు,కనువిందు చేసే కట్టడాలను నిర్మించే భవన నిర్మాణ కార్మికులు గత కొన్ని రోజులుగా పనులు లేక ఖాళీగా ఉంటున్నారని భవన నిర్మాణ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

మంగళవారం నేరేడుచర్ల పట్టణంలో పనులు లేక ఖాళీగా ఉన్న భవన నిర్మాణ కార్మికులు అడ్డా మీదనే నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ ఇక్కడే కాకుండా రాష్ట్రంలో ఎక్కడా పనులు దొరకక కార్మికులు పస్తులతో విలవిలలాడుతున్నారని,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసరాల ధరలతో పాటు గృహ నిర్మాణానికి సంబంధించిన సిమెంటు,ఇసుక,ఐరన్ మరియు భవన నిర్మాణానికి కావాల్సిన ఇతర సామాగ్రి ధరలు అధికంగా పెంచడంతో,కార్మికులకు ఈ పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.రైతుల వ్యవసాయానికి కావలసిన అడుగు మందు, యూరియా,పురుగుమందుల ధరలు అధికంగా పెరగడంతో రైతులకు వడ్ల గిట్టుబాటు ధర లేకపోవడంతో,ఇటు రైతులు అటు వ్యాపారస్తులు నూతనంగా భవనాలు నిర్మించుకునే వీలు లేనందున ఎవరు పనులు చేయించుకోకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

Stopping Adda Is Your Life-ఆగమవుతున్న అడ్డా మీ

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా నిత్యవసర వస్తువులపై భవన నిర్మాణానికి అవసరమైన సామాగ్రిపై వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.పనులు లేక పేద భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బందులు గురవుతున్నారని, ప్రభుత్వం వెంటనే భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని,రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల వెల్ఫేర్ బోర్డు నిధుల నుండి 50 ఏళ్లు నిండిన ప్రతి కార్మికురికి 5000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని,అడ్డాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ రంగ కార్మికులు సైదులు,సూరిబాబు,రమేష్,ఆదామ్ వలి,నరసింహ, వినోద్,సైదులు,కోటయ్య,శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement
రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువు పెంచినట్టా లేనట్టా...?

Latest Suryapet News