ప్రభుత్వ విద్యపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి:నకిరేకల్ ఎంపీపీ బాచుపల్లి శ్రీదేవి

నల్లగొండ జిల్లా( Nalgonda District ):రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా పాఠశాల పునఃప్రారంభం తొలిరోజే విద్యార్దులకు యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు అందజేసి, మధ్యాహ్న భోజన పథకం అమలుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని నకిరేకల్ ఎంపీపీ బాచుపల్లి శ్రీదేవి( MPP Bachupalli Sridevi ) అన్నారు.

గురువారం నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ఆమె పాల్గొని,ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న యూనిఫామ్, పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందజేశారు .

అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తుందని,ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా ఎవరి ఊరిలో వారు తమ ఊరి ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ మొత్తంలో విద్యార్థులకు చేర్పించి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రశేఖర్,నోడల్ ఆఫీసర్ వీరారెడ్డి,పెళ్లిపాక లక్ష్మి, గాదని కొండయ్య,మాజీ ఎంపీటీసీ పుట్టా సరిత, సత్యనారాయణ గౌడ్,( Satyanarayana Goud )గుడి చైర్మన్ మల్లికార్జున వెంకటయ్య,శివాలయం చైర్మన్ కోటగిరి రాధాకృష్ణ, పాఠశాల మాజీ చైర్మన్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

వావ్, ఆటోను మినీ లైబ్రరీగా మార్చేసిన డ్రైవర్.. బుక్స్ ఫ్రీగా తీసుకోవచ్చట..

Latest Nalgonda News