బిజెపిపై స్టాలిన్ కొత్త అస్త్రం “స్పీకింగ్ ఫర్ ఇండియా”

కేంద్ర అధికార పార్టీ బిజెపికి( BJP ) వ్యతిరేకంగా ప్రదాన ప్రతిపక్షాలన్నీ పట్టుదలగా ఏర్పాటు చేసిన ఇం.డి.యా కూటమి( INDIA Alliance ) తన జోరు పెంచుతున్నట్టుగా తెలుస్తుంది.ఇప్పటికి రెండుసార్లు సమావేశమైన ఇండియా కూటమి ఇప్పుడు నిర్వాహక కమిటీలు, కన్వీనర్ల నియామకం , ప్రచార కమిటీల నిర్మాణం కోసం మరొకసారి ముంబై వేదికగా సమావేశం అయ్యారు .విభజిత శివసేన అదినేత ఉద్ధవ్ ఠాక్రే ఈ సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చారు .మరోవైపు ఇండియా కూటమి లో కీలక భాగస్వామి అయినా డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్( CM Stalin ) తన బాజాపా పై తన ఎన్నికల యుద్దాన్ని అప్పుడే మొదలుపెట్టేశారు .తన కొత్త పోడ్ కాస్ట్ ఆడియో సిరీస్ ను స్టార్ట్ చేశారు.

 Stalin New Weapon On Bjp Is Speaking For India Details, Cm Stalin, Mk Stalin, Ta-TeluguStop.com
Telugu Cm Stalin, Dmk, India Alliance, Mk Stalin, National, India, Taminadu Cm-T

“ భారతదేశ కోసం ఒక దక్షిణాది స్వరం మాట్లాడుతుంది “అంటూ ఆయన ట్విట్టర్లో హాండిల్ లో పోస్ట్ చేశారు.భాజపా నాయకత్వంలో దేశం నాశనం అవుతుందని, ఇప్పుడు మాట్లాడ వలసిన సమయం ఆసన్నమైందని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.డిఎంకె పార్టీ( DMK Party ) స్థాపించి 75 సంవత్సరాలు అయిందని ,ఒక మొక్కగా ఉన్న పార్టీ అనేక శాఖలుగా విస్తరించి ఇప్పుడు పార్లమెంట్లో మూడో ప్రభావంతమైన పార్టీగా నిలబడ్డామని, తమ దివంగత నాయకులు అన్నాదురై కరుణానిది లు దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపించారని ఇప్పుడు తమిల ప్రజలు దేశ రాజకీయాలపై ప్రభావం చూపించాల్సిన సమయం వచ్చిందంటూ ఆయన పిలుపునిచ్చారు.

Telugu Cm Stalin, Dmk, India Alliance, Mk Stalin, National, India, Taminadu Cm-T

ముఖ్యంగా భాజపా పరిపాలనలోని పాలనా వైఫల్యాలను, మత విద్వేషాలను టార్గెట్ చేస్తూ ఆయన ఆడియో సిరీస్ ను ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.విడతల వారిగా భాజపా ప్రభుత్వం విఫలమైన అంశాలను హైలెట్ చేస్తూ, ప్రతిపక్షాలపై ఏ విధమైన కక్ష సాధింపు చర్యలకు బిజెపి పాల్పడుతుందో వివరించబోతూ సాగే ఈ పోడ్ కాస్ట్ దేశ రాజకీయాలలో ప్రభావంతమైన పొలిటికల్ సిరీస్ గా ఇది నిలబడుతుంది అన్న అంచనాలు వినిపిస్తున్నాయి.మరి స్టాలిన్ ఆడియో సిరీస్ కు భాజపా నేతల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube