తడిసిన ధాన్యం ఆగ్రహించిన అన్నదాతలు

యాదాద్రి భువనగిరి జిల్లా: గుండాల మండల కేంద్రంలోని పిఎసిఎస్ ( PACS )కొనుగోలు కేంద్రంలో ధాన్యం బస్తాలు వర్షంతో తడిసి పోవడంతో ఆగ్రహించిన అన్నదాతలు తడిసిన ధాన్యంతో రోడ్డెక్కారు.

ఈ సందర్భంగా రైతు అందెం కృష్ణారెడ్డి( Andem Krishna Reddy ) మాట్లాడుతూ గత మూడు నెలల నుండి కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేయడంతో మంగళవారం కురిసిన వర్షానికి ధాన్యం బస్తాలు పూర్తిగా తడిసి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే దళారులు మిల్లర్లు ఏకమై డబ్బులు ఇచ్చినవారి వడ్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, మిగతా వారి ధాన్యం ఇలా వర్షార్పణం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

Stained Grain Angered Rice Farmers , Andem Krishna Reddy, PACS-తడిసి�

ఈ కార్యక్రమంలో బాధిత రైతులు రంగారెడ్డి, కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

కూరగాయల కొనుగోలులో సామాన్యుడికి తప్పని తిప్పలు
Advertisement

Latest Suryapet News