తనపై ఫిర్యాదు పై రియాక్ట్ అయిన యాంకర్ శ్రీముఖి...

తెలుగు బుల్లితెర పరిశ్రమలో టీవీ ఛానల్ తో సంబంధం లేకుండా దాదాపుగా అన్ని ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానళ్లలో పలు రకాల షోలు, ఈవెంట్లు నిర్వహిస్తూ తన గలగల మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న యాంకర్ మరియు బుల్లితెర రాములమ్మ శ్రీముఖి గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.అయితే అప్పట్లో యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరించిన “జూలకటక” అనే షోలో శ్రీముఖి చేసినటువంటి వ్యాఖ్యలు బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉన్నాయని తాజాగా కొందరు వ్యక్తులు యాంకర్ శ్రీముఖి పై హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

 Sreemukhi, Tollywood Actress, Fir Filed Issue, Bramhins Issue, Tollywood-TeluguStop.com

తాజాగా ఈ విషయంపై యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియా ద్వారా స్పందించింది.ఇందులో భాగంగా తాను ఏ వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడలేదని చెప్పుకొచ్చింది.అంతేగాక ఎప్పుడో రెండు సంవత్సరాల క్రిందట షూట్ చేసినటువంటి ప్రోగ్రాం గురించి ఇప్పుడు అభ్యంతరాలు లేవనెత్తడం ఏంటో తనకు ఇప్పటికీ అర్థం కాలేదని వాపోతోంది.అలాగే మొదటిసారి ఈ ఎపిసోడ్ ని ప్రసారం చేసినప్పుడు ఎవరూ అభ్యంతరాలు తెలియజేయలేదని తెలిపింది.

కాగా తనపై నమోదైనటువంటి ఫిర్యాదు విచారణకు పోలీసులకు సహకరిస్తానని సోషల్ మీడియా ద్వారా తెలిపింది.అయితే ఈ విషయంపై నెటిజన్లు రాములమ్మకి తమ మద్దతును తెలియజేస్తున్నారు.

అంతేగాక గతంలో ఎప్పుడో జరిగి పోయిన విషయం గురించి ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం ఏంటని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన టువంటి “జులాయి” చిత్రంతో సినీ పరిశ్రమకు పరిచయమైనటువంటి ఈ అమ్మడు ప్రస్తుతం ఒకపక్క పలురకాల షోలు, ఈవెంట్లు చేస్తూనే మరో పక్క సినిమాల్లో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తూ బాగానే రాణిస్తోంది.

ఇటీవలే టాలీవుడ్ కి చెందిన అటువంటి ఓ స్టార్ హీరో చిత్రంలో ప్రాధాన్యత కలిగినటువంటి పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube