పాత ప్రభుత్వ ఆసుపత్రి స్థలాన్ని వినియోగంలోకి తేవాలి:సామాజిక కార్యకర్త బెల్లంకొండ శేఖర్

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల పట్టణంలో గతంలో ప్రభుత్వ ఆసుపత్రి ఉన్న స్థలం ఇప్పుడు పూర్తిగా నిరుపయోగంగా ఉందని సామాజిక కార్యకర్త బెల్లంకొండ శేఖర్ అన్నారు.

ఎంతో కాలం నుండి 90 దశకం వరకు నేరేడుచర్ల ప్రభుత్వ ఆసుపత్రి,ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఈ ఆవరణలో భాగంగా ఉండేది.

ఆసుపత్రి పూర్తిగా శిధిలమై ప్రస్తుతం ఖాళీ స్థలంగా మారి ఉన్నత పాఠశాల స్థలంలో కలిసిపోయిందన్నారు.ప్రస్తుతం ఆ స్థలం పాఠశాలకు కూడా ఉపయోగంలో లేదని,ఆ స్థలంలో ఆరోగ్య ఉపకేంద్రం,గ్రంధాలాయం నిర్మిస్తే,ఎంతో మంది ప్రజలకు,యువకులకు, విద్యార్థులకు ఉపయోగపడుతుందని అన్నారు.

మున్సిపల్ అభివృద్ధి నిధుల నుండి కొంత నిధులు వీటికి కేటాయించి అభివృద్ధి చేయాలని,మున్సిపల్ పాలకవర్గానికి విన్నవించారు.

పెన్ పహాడ్ మండలంలో యువకుడు అదృశ్యం
Advertisement

Latest Suryapet News