గొర్రెల పంపిణీ పథకాన్ని మున్సిపాలిటీల్లో కూడా వర్తింపజేయాలి:ధనుంజయ నాయుడు

సూర్యాపేట జిల్లా: మున్సిపాలిటీలోనూ అలాగే,నగర కార్పొరేషన్లలో జీవిస్తున్న నిరుపేదలైన గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ పథకాన్ని వర్తింపజేయాలని తెలంగాణ బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు డిమాండ్ చేశారు.

శనివారం ఆయన పాలకవీడు మండల కేంద్రంలో పత్రిక ప్రకటన విడుదల చేస్తూ మాట్లడుతూ ఉపాధి హామీ పథకాన్ని కూడా నగరపాలక కేంద్రాల్లో, మున్సిపల్ కేంద్రాలలో విస్తరింప చేయాలని అనేక ఉద్యమాలు నిర్వహించామని,ఇప్పుడు గొర్రెల పంపిణీ పథకం కూడా మున్సిపల్ కేంద్రాల్లో లేకుండా చేశారని,రాష్ట్ర వ్యాప్తంగా గొల్ల, కురుమలకు ప్రభుత్వ అందజేసిన గొర్రెల పంపిణీ బదులుగా లబ్ధిదారుల ఖాతాలోకి నగదు బదిలీలు చేయాలని, తద్వారా పట్టణ ప్రాంతాల్లో ఉన్న గొల్ల,కురుమలు వారికి నైపుణ్యం ఉన్నపనిలో పెట్టుబడిగా పెట్టి స్వయం ఉపాధి పొందుతారని,తద్వారా బీసీ కుటుంబాలు ఆర్థికంగా నిలబడతాయని అన్నారు.

మొదట విడత గొర్రెల పంపిణీ పథకంలో, దళారులు మాత్రమే బాగుపడ్డారని,తమ మాట వినని గొర్రెల పెంపకం దారులకు పశు వైద్యాధికారులు కక్షగట్టి ముసలి గొర్రెల ఇప్పించారని,తమ మాట విన్నవారికి ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన గొర్రెలు కొందరికి పంపిణీ చేయగా మరికొందరికి డబ్బులు ఇచ్చారని అందుకు మధ్యవర్తులుగా కమిషన్లు బొక్కారని ఆయన విమర్శించారు.ఇతర రాష్ట్రాలలో తెచ్చిన గొర్రెలను తెలంగాణ రాష్ట్రంలో పంపిణీ చేయగా అక్కడి పెరిగిన గొర్రెలు ఇక్కడి వాతావరణంలో ఇమడలేక చాలావరకు చనిపోయాయి ఆవేదన వ్యక్తం చేశారు.

అందువల్ల గొర్రెలకు బదులుగా నేరుగా లబ్ధిదారులకే వారి ఖాతాల్లో 1,50,000 జమ చేయాలని ధనుంజయ నాయుడు తన ప్రకటనలో కోరారు.

విద్యాధికారులే జిల్లాలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు..
Advertisement

Latest Suryapet News