నిమజ్జనానికి ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగుతున్న ఏర్పాట్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామం లో నేడు ప్రారంభమయ్యే గణేష్ నిమజ్జన కార్యక్రమం కోసం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలో అవసరమైన చోట ప్రధాన రహదారి వెంబడి లైట్ల ఏర్పాటు కొనసాగుతుంది.

గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేసే గీద్దే చెరువు వద్ద కూడా నిమజ్జనం కోసం లైట్ల ఏర్పాటు చేయడం జరిగింది.

గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మలను కూడా గత రెండు రోజులుగా తొలగించడం జరుగగా లైట్ల ఏర్పాటు,చెట్ల కొమ్మల తొలగింపు కార్యక్రమం స్థానిక పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జరగగా ఆయన వెంట మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్, లైటింగ్ ఇంచార్జీ కటకం రామచంద్రం ఉన్నారు.పోలీస్ శాఖకు సహకరించండి.

మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్.ఎల్లారెడ్డి పేటలో గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖ కు సహకరించాలని, వినాయక మంటపం నిర్వాహకులను మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ కోరారు.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Advertisement

Latest Rajanna Sircilla News