సిరిసిల్ల మానేరు తీరంలో నిమజ్జన వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ..

రాజన్న సిరిసిల్ల జిల్లా: వినాయక మండపాల నిర్వాహకులు నిర్ణీత సమయానికి విగ్రహాలను తరలించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు.ఈ నెల 17న మంగళవారం వినాయక విగ్రహాల నిమజ్జనానికి సిరిసిల్లలోని మానేరు తీరంలో చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ పలు శాఖల అధికారులు సోమవారం పరిశీలించారు.

 Collector Sp Inspected The Immersion Ceremony Arrangements At Sirisilla Maneru,-TeluguStop.com

వినాయక మంటపాల నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తిశ్రద్ధల మధ్య వేడుకలు నిర్వహిస్తూ వైభవంగా తరలించాలని సూచించారు.ప్రజా ప్రతినిధులు, యువత ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.అధికారులు సూచించిన మేరకు సౌండ్ బాక్స్లు పెట్టుకోవాలని ఆదేశించారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్ళి, వేడుకలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.

ఇక్కడ సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ మీర్జా ఫసహత్ అలీ బేగ్, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube