పాఠశాలల వద్ద పరేషాన్ చేస్తున్న కేటుగాళ్లు...!

సూర్యాపేట జిల్లా:మునగాల మండల( Munagala mandal ) కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్,ఆదర్శ పాఠశాల వద్ద ఉదయం,సాయంత్రం కొందరు కేటుగాళ్లు బైక్ లపై కేకలు వేస్తూ అమ్మాయిలను వేధిస్తున్నారని విద్యార్ధినులు వాపోతున్నారు.

వీరి ఆగడాలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయని,స్కూలుకు వెళ్లే విద్యార్ధినులను ఇబ్బంది పెడుతూ బైక్ లపై ( Bikes )రౌండ్స్ వేస్తూ కేరింతలు కొడుతూ హల్చల్ చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని,స్కూల్ కి రావాలంటేనే భయమేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.


స్కూల్( schools ) కి వెళ్ళాలంటే పిల్లలు ఇబ్బంది పడుతున్నారని,కొందరు యువకులు మద్యం,గంజాయి సేవించి అమ్మాయిలను వేధిస్తున్నారని,ఈ ఆకతాయిల ఆటలు కట్టడి చేయడానికి పోలీసులు( Police ) ఉదయం, సాయంత్రం పెట్రోలింగ్ చేసి, వీరిని పాఠశాలల ఆవరణలకు రానివ్వకుండా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.ఈ బ్యాచ్ మండల కేంద్రంలో కూడా వీధులు ఇష్టానుసారంగా తిరుగుతూ గ్రామస్తులను కూడా భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Scammers Causing Havoc At Schools...! , Munagala Mandal, Suryapet District , Sch
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు థ్యాంక్స్ చెప్పిన బండ్ల గణేష్.. అసలేం జరిగిందంటే?

Latest Suryapet News