సావిత్రి బాయి పూలే ఆశయ సాధనకు కృషి - కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా :సావిత్రి బాయి పూలే ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు.

సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఆమె చిత్రపటానికి కలెక్టర్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ జిల్లా అధికారులతో కలిసి శుక్రవారం పూల మాలలు వేసి, నివాళులర్పించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడారు.మహిళల విద్యకు ఆద్యురాలిగా నిలిచి, సమానత్వానికి పోరాడారని వివరించారు.

పూలె దంపతుల సేవలను త్యాగాలను గుర్తు చేసుకున్నారు.భారత సమాజంలో చారిత్రాత్మకమైన మార్పుకు సావిత్రిబాయి పూలే పునాది వేశారన్నారు.

ఇక్కడ జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, ఆయా శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News