సంప్రదాయ క్రాంతి తప్పిన సంక్రాంతి...!

నల్లగొండ జిల్లా:తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి పెద్ద పండుగ.మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగను ప్రజలు ఎంతో సరదాగా, సంతోషంగా జరుపుకుంటారు.

భోగి, సంక్రాంతి,కనుమ మూడు రోజులు పిల్లలు,పెద్దలు కలిసి సంతోషంగా సంబురాలు జరుపుకుంటారు.కానీ, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒకప్పటి సంక్రాంతి కళ ఇప్పుడు గ్రామాల్లో కనిపించడం లేదు.

Sankranti Missed Traditional Kranti , Sankranti , Kranti , Dudu Basavanna's Viny

సంక్రాంతి అనగానే ఇంటి ముందర రంగురంగుల రంగవల్లులు,డూడూ బసవన్నల విన్యాసాలు, హరిదాసు కీర్తనలు గుర్తుకొస్తాయి.ప్రస్తుతం పట్టణాల్లోనే కాదు గ్రామాల్లో కూడా ఎక్కడా కూడా గంగిరెద్దులు, హరిదాసులు కనిపించడం లేదు.

మారుతున్న కాలంతో పాటే డూడూ బసవన్నలు,హరిదాసులు కనుమరుగవుతున్నారు.నేటి తరం పిల్లలకు సంక్రాంతి సందర్భంగా వికసించే సంస్కృతి, సంప్రదాయాలు, బసవన్నలు,హరిదాసు కీర్తనలు కేవలం సినిమాల్లోనే చూస్తున్నారని,ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

Advertisement
కులం పేరుతో దూషించిన ముగ్గురికి ఆరు నెలలు జైలు శిక్ష

Latest Nalgonda News