దర్శకుడు సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) దర్శకత్వం వహించిన యానిమల్ సినిమా ఇటీవలే విడుదల అయి మంచి సక్సెస్ ను సాధించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.
అందులో భాగంగానే వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.ఇకపోతే సందీప్ రెడ్డి త్వరలోనే ప్రభాస్ తో( Prabhas ) స్పిరిట్( Spirit Movie ) అనే సినిమాను చేయబోతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా అప్డేట్స్ కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు.తాజాగా సందీప్ వంగా దీని గురించి మాట్లాడారు.
ఒక బాలీవుడ్ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన స్పిరిట్ మూవీపై స్పందించారు.

ఈ సందర్భంగా సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.ప్రస్తుతం నేను ప్రభాస్‌తో చేయనున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్నాను.అందరూ అనుకుంటున్నట్లు ఇది హారర్ స్టోరీ కాదు.
ఒక నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ కథ.( Police Officer Story ) ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.అనంతరం యానిమల్ పార్క్ ( Animal Park ) సినిమాను రూపొందిస్తాను.ప్రస్తుతానికి ఈ అప్డేట్ మాత్రమే ఇవ్వగలను అని చెప్పారు.పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా ముస్తాబు కానున్న ఈ చిత్రంలో ప్రభాస్ తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి, లాఠీ ఝుళిపించనున్నారు.గతంలో నిర్మాత ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.

ఇందులో మునుపెన్నడూ చూడని ప్రభాస్‌ని చూస్తారని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.దాంతో ఈ చిత్రం పై అంచనాలు రెట్టింపయ్యాయి.ఈ పోలీస్ డ్రామాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు.ఎనిమిది భాషల్లో ఈ చిత్రం రానుంది.ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్( Raja Saab Movie ) చిత్రంతో బిజీగా ఉన్నారు.మారుతి దర్శకత్వంలో రొమాంటిక్ హారర్ చిత్రంగా ఇది రూపొందుతోంది.
ఇప్పటికే పలు షెడ్యూళ్ల షూటింగ్ కూడా పూర్తయింది.ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ కథానాయికలుగా నటిస్తున్నట్లు సమాచారం.
దీనితో పాటు కల్కి 2898 ఏడీలో( Kalki 2898 AD ) ప్రభాస్ నటిస్తున్నారు.సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మే 9న విడుదల కానుంది.